Viral Video: జుగాడ్ సాయంతో ఐస్ క్రీమ్ తయారీ.. మమ్మల్ని తిండి తిననివ్వండి అంటూ మండిపడుతున్న నెటిజన్లు
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఐస్ క్రీం తయారు చేసేందుకు ఓ వింత ట్రిక్ అవలంబించాడు. ఇది చూసి ఇలా కూడా ఐస్ క్రీం తయారు చేయవచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఓ వ్యక్తి తన కారు చక్రానికి చిన్న బకెట్ లాంటి పెట్టెని కట్టి అందులో గుడ్లు, పాలు, చాక్లెట్, పంచదార ఇలా రకరకాల వస్తువులను వేసి ఐస్ క్రీం తయారీకి రెడీ అయ్యాడు.
సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం అరచేతిలో దర్శనమిస్తోంది. అంతర్జాలం మొత్తం జుగాడ్‌లతో నిండి ఉంది. ప్రజలు కూడా ఆశ్చర్యపోయేలా ఏదైనా తయారు చేయడానికి తెలివి తేటలకు పదును పెట్టి రకరకాల జుగాడ్‌లను తయారుచేస్తున్నారు. ముఖ్యంగా మన వారు రకరకాల జుగాడ్ లను తయారు చేయడంలో సిద్ధహస్తులు అని తెలియజేసే రకరకాల వస్తువులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. కొందరు.. స్వదేశీ జుగాడ్ తో 7 సీట్ల బైక్‌ను తయారు చేస్తే.. మరికొందరు సులభంగా పని చేసే వసతులకు సంబంధించిన జుగడ్ లను తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి వీడియోల్లో కొందరు వ్యక్తులు తమ ఆలోచనలతో వింత వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇలాంటి ఐడియాలు ప్రశంసలను అందుకుంటే.. మరికొన్ని సార్లు బాబోయ్ మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అంటూ తమ వ్యతిరేకతను తెలియజేస్తారు. ప్రస్తుతం అలాంటి జుగాడ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఐస్ క్రీం తయారు చేసేందుకు ఓ వింత ట్రిక్ అవలంబించాడు. ఇది చూసి ఇలా కూడా ఐస్ క్రీం తయారు చేయవచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఓ వ్యక్తి తన కారు చక్రానికి చిన్న బకెట్ లాంటి పెట్టెని కట్టి అందులో గుడ్లు, పాలు, చాక్లెట్, పంచదార ఇలా రకరకాల వస్తువులను వేసి ఐస్ క్రీం తయారీకి రెడీ అయ్యాడు. వస్తువులను వేసిన తర్వాత బాక్స్ మూతను పెట్టి తెరుచుకోకుండా గట్టిగా బిగించాడు. ఆ తర్వాత కారుని స్టార్ట్ చేసి రోడ్డుపై కొంత సేపు నడిపి ఐస్ క్రీం రెడీ చేశాడు. అనంతరం ఐస్ క్రీం టేస్ట్ చేసి.. చాలా బాగుందని అంటూ రియాక్షన్ ఇచ్చాడు.
ఈ వింత జుగాడ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పరీఖ్‌జైన్ అనే ఐడితో షేర్ చేశాడు. ఈ వీడియోకు ఇది ఐస్‌క్రీం తయారు చేసే వింత మార్గం అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
A weird way of making ice cream outdoors!#EIIRInteresting #engineering #icecream #jugaad Credit: Blake kinsman (TT), ViaWeb pic.twitter.com/lnrIsW5Tmj
— Pareekh Jain (@pareekhjain) July 4, 2023
చాలా మంది ఐస్ క్రీం తయారు చేసే వివిధ మార్గాలను చూసి ఉంటారు.. కానీ ఇప్పటి వరకూ ఇలాంటి ఐస్ క్రీమ్ తయారు చేసే పద్ధతిని చూసి ఉండరు అని చెప్పవచ్చు. టేస్టీ ఐస్‌క్రీమ్‌ని ఇలా కూడా తయారుచేయవచ్చని మేము ఇప్పటి వరకూ అనుకోలేదంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..