Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rare Stone: తిమింగలం మృత దేహంలో కోట్ల విలువైన రాయి.. వీర్యవృద్ధికి, ఫెర్‌ఫ్యూమ్స్ తయారీలో వినియోగం..

తిమింగళం మృతికి కారణం దాని పేగుల్లో ఏర్పడిన ఒక వింత రాయి అనే విషయాన్నీ కనుగొన్నారు.  పేగులో ఏర్పడిన రాయి వలన తిమింగలం జీర్ణ వ్యవస్థలో అనేక ఇబ్బందులు తలెత్తాయని.. దీంతో వేల్  మరణించిందని తెలుసుకున్నారు. ఈ రాయి సుమారు 9 కేజీల పైనే బరువుంది. అంత పెద్ద రాయి ఏర్పడటంతో పేగులో డిఫ్‌థెరాయిడ్ కోలిటిస్ అనే సమస్య తలెత్తిందని, దాంతో బ్యాక్టీరియాలు పెరిగి అవి రక్తంలో చేరడంతో అనేక అవయవాల్లో రక్తస్రావం జరిగి అది చనిపోయిందని తేల్చారు

Rare Stone: తిమింగలం మృత దేహంలో కోట్ల విలువైన రాయి.. వీర్యవృద్ధికి, ఫెర్‌ఫ్యూమ్స్ తయారీలో వినియోగం..
Rare Stone Dead Whale
Follow us
Surya Kala

|

Updated on: Jul 07, 2023 | 12:04 PM

స్పెయిన్‌లోని కానరీ ద్వీపానికి చెందిన లా పల్మా ప్రాంతంలోని ఓ బీచ్‌లో అతిపెద్ద తిమింగలం చనిపోయింది. దాని మృతకళేబరాన్ని కొంతభాగం సముద్ర జీవులు తినేశాయి. మిగతా భాగం కుళ్లిపోయింది. ఈ విషయం వైరల్ అయ్యి.. చివరికి పరిశోధకుల చెవినపడింది. రంగంలోకి దిగిన శాస్త్రజ్ఞులు అసలు అది ఎందుకు చనిపోయిందో తెలుసుకునేందుకు పరిశోధనలు ప్రారంభించారు. కొన్ని రోజులపాటు పరిశోధించిన తర్వాత తిమింగళం మృతికి కారణం దాని పేగుల్లో ఏర్పడిన ఒక వింత రాయి అనే విషయాన్నీ కనుగొన్నారు.  పేగులో ఏర్పడిన రాయి వలన తిమింగలం జీర్ణ వ్యవస్థలో అనేక ఇబ్బందులు తలెత్తాయని.. దీంతో వేల్  మరణించిందని తెలుసుకున్నారు.

ఈ రాయి సుమారు 9 కేజీల పైనే బరువుంది. అంత పెద్ద రాయి ఏర్పడటంతో పేగులో డిఫ్‌థెరాయిడ్ కోలిటిస్ అనే సమస్య తలెత్తిందని, దాంతో బ్యాక్టీరియాలు పెరిగి అవి రక్తంలో చేరడంతో అనేక అవయవాల్లో రక్తస్రావం జరిగి అది చనిపోయిందని తేల్చారు. ఇక అసలు విషయం ఏమిటంటే తిమింగలం కడుపులో ఉన్న ఈ రాయి విలువ సుమారు 4 కోట్లు ఉంటుందని వారు అంచనా వేశారు. దాంతో అందరూ ఆశ్చర్యపోయారు. తిమింగళం పేగుల్లో ఏర్పడిన ఈ రాయిని ఆంబర్‌గ్రీస్ అంటారు.

ఈ తిమింగలాలు తిన్న ఆహారం రాళ్లుగా రూపాంతరం చెందుతాయి. ఏ విధంగా అంటే.. మానవుల కిడ్నీల్లో ఏ విధంగా రాళ్లు ఏర్పడతాయో అదే విధంగా తిమింగళలాల పేగుల్లో తిన్న ఆహారం వేస్టేజ్ ఇలా రాళ్లుగా మారతాయి. సాధారణంగా ఈ రాళ్లు చిన్న సైజులో ఉంటే తిమింగలం వాంతి చేసుకోవడం ద్వారా లేదా మలవిసర్జన వల్ల బయటికి వెళ్లిపోతాయి. లేకపోతే అవి క్రమంగా పెద్దగా మారతాయి. అలాంటప్పుడు తిమింగళానికి జీర్ణవ్యవస్థలో అడ్డంకులు ఏర్పడి చనిపోతాయి. అయితే ఇలా ఏర్పడిన రాయికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. వాటిని సుగంధ ద్రవ్యాల తయారీలోను, వీర్యవృద్ధి కోసం వాడే మందుల తయారీలోనూ ఎక్కువగా వినియోగిస్తారు. చైనాలో అయితే రెడీ టు ఈట్‌ ఫుడ్‌లో ఈ రాయిని ఉపయోగిస్తారు. ఎక్కువ శాతం మాత్రం పెర్‌ఫ్యూమ్స్‌ తయారీలోనే ఉపయోగిస్తారు. అందుకే తిమింగలం కడుపులో ఏర్పడే ఈ రాళ్లకు అంత ధర ఉంటుంది. ఈ రాళ్లు ఎక్కడంటే అక్కడ దొరకవు. అందుకే చిన్న రాయి కూడా కోట్ల ధర పలుకుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..