AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shiva Temple: పాక్, శ్రీలంక, నేపాల్ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధ శివాలయాలు.. వాటి విశిష్టత..

శివుని ఆరాధించడమే కాకుండా.. శివాలయాలను సందర్శించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అయితే శివాలయాలు భారతదేశంలోనే కాకుండా దేశం వెలుపల కూడా చాలా ఉన్నాయి. ఈ ఆలయాలను సందర్శించడం ద్వారా మనిషి కోరిక నెరవేరుతుంది. ఈ రోజు విదేశాల్లో కూడా ఉన్న ఫేమస్ శివాలయల గురించి తెలుసుకుందాం.. 

Shiva Temple: పాక్, శ్రీలంక, నేపాల్ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధ శివాలయాలు.. వాటి విశిష్టత..
Famous Shiva Temple
Surya Kala
|

Updated on: Jul 04, 2023 | 8:35 AM

Share

త్రిమూర్తుల్లో లయకారుడు శివుడు దుఃఖం, భయం నుండి రక్షణ ఇస్తాడు. హిందూ మతంలో మహాదేవుని ఆరాధించడం వలన సుఖ సంపాదనలు లభిస్తాయని విశ్వాసం. ఈ నేపథ్యంలో శ్రావణ మాసం శివునికి ఎంతో ప్రీతికరమైనదని.. పూజలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. శివుని ఆరాధించడమే కాకుండా.. శివాలయాలను సందర్శించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అయితే శివాలయాలు భారతదేశంలోనే కాకుండా దేశం వెలుపల కూడా చాలా ఉన్నాయి. ఈ ఆలయాలను సందర్శించడం ద్వారా మనిషి కోరిక నెరవేరుతుంది. ఈ రోజు విదేశాల్లో కూడా ఉన్న ఫేమస్ శివాలయల గురించి తెలుసుకుందాం..

ముక్తి గుప్తేశ్వర్ ఆలయం: ఆస్ట్రేలియా ముక్తి గుప్తేశ్వర్ ఆలయం ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 13వ జ్యోతిర్లింగానికి సంబంధించినది. సంవత్సరం పొడవునా ఈ ఆలయంలోని శివయ్య దర్శనం కోసం భారీ  సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. అయితే శ్రావణ మాసంలో మరింత అధికంగా భక్తులు చేరుకుంటారు.

నేపాల్ పశుపతినాథ్ ఆలయం ఈ ఆలయం పాండవులకు సంబంధించినదని..  శివునికి అంకితం చేయబడింది.  నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉన్న ఈ ఆలయంలో ప్రసిద్ధ శివుని విగ్రహం ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన ఆసక్తికరమైన మతపరమైన కథ ఉంది. వేలాది మంది స్వదేశీ, విదేశీ యాత్రికులు లేదా భక్తులు ఆలయాన్ని సందర్శించేందుకు వస్తుంటారు. పశుపతినాథుడు శివుని దర్శనానికే కాకుండా అందానికి కూడా ప్రసిద్ధి.

ఇవి కూడా చదవండి

శ్రీలంకలో ఉన్న మున్నేశ్వరం ఆలయం పురాణాల ప్రకారం ఈ ఆలయం రాముడు.. రావణుడి వధకు సంబంధం కలిగి ఉందని విశ్వాసం. రావణుడిపై గెలిచిన తర్వాత రాముడు ఇక్కడ శివుడిని పూజించాడని చెబుతారు. అందుకే ఈ ఆలయం రామాయణ కాలంతో ముడిపడి ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయం ఇండోనేషియాలో హిందూ మతానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో ఉన్నారు. ఈ దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ఇండోనేషియాలోని జావాలోని ప్రంబనన్ ఆలయం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడిన ఈ ఆలయ సముదాయం చాలా పెద్దది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ ఆలయ ప్రాంగణంలో దాదాపు 240 దేవాలయాలు ఉన్నాయి.

పాకిస్థాన్‌లోని కటాస్‌రాజ్ శివాలయం పాకిస్థాన్‌లోని ఈ శివాలయానికి 900 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయ చరిత్ర శివుడు, సతిలతో పాటు పాండవులకు సంబంధించినది. దక్షుడు తనయ సతి అగ్నికి తనను తాను సమర్పించుకున్నప్పుడు శివుని కన్నీళ్లు ఇక్కడ పడ్డాయని చెబుతారు. అందుకే ఇక్కడ అమృత్ కుండ్ సరోవర్ ఏర్పడింది. శివరాత్రి, శ్రావణ మాసంలో ఈ ఆలయంలో భారీగా భక్తులు చేరుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).