AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Falahari Baba: ఏడాదిలో 48 సార్లు శివయ్యకు అభిషేకం.. 40 ఏళ్లుగా ఆహారం తీసుకోని ఫలహరి బాబా ..

కన్వరియా జాముయికి చెందిన రాజు యాదవ్.. ను 'ఫలహారి బాబా' అని కూడా పిలుస్తారు. రాజు యాదవ్ సంవత్సరానికి 48 సార్లు శివయ్యకు జలాభిషేకం చేస్తాడు. సుల్తాన్‌గంజ్ నుండి నీటిని తీసుకుని 105 కిలోమీటర్లు నడిచి డియోఘర్ చేరుకుంటాడు.. ఇక్కడ శివయ్యకు జలాభిషేకం చేస్తాడు. ఈ సమయంలో ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షను చేపడతారు. ప్రతి నెలా నాలుగు సార్లు ఇలా శివయ్యకు జలాభిషేకం చేస్తాడు. 

Falahari Baba: ఏడాదిలో 48 సార్లు శివయ్యకు అభిషేకం.. 40 ఏళ్లుగా ఆహారం తీసుకోని ఫలహరి బాబా ..
Falahari Baba
Surya Kala
|

Updated on: Jul 04, 2023 | 10:01 AM

Share

ఉత్తరాదిలో శ్రావణ మాసం మంగళవారం అంటే నేటి నుంచి ప్రారంభంకానుంది. సుల్తాన్‌గంజ్, డియోఘర్  కావండియా రహదారిపై భక్తులు సందడి నెలకొంది. బీహార్‌లోని సుల్తాన్‌గంజ్‌లో ప్రవహిస్తున్న ఉత్తరవాహిని గంగా నది నుంచి నీరు నింపిన కావడితో భక్తులు హరహర మహాదేవ శంభోశంకర అంటూ తిరిగి  బయలుదేరతారు. ప్రతి సంవత్సరం బాబా బైధ్‌నాథ్ ధామ్‌కు నీరు సమర్పించే కావడి కుండల గురించి  అద్భుతమైన, ఊహించలేని విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. వీటిని సంబంధించిన విషయాలు వినడం లేదా చూడడం చాలా ఆసక్తికరంగా ఉంటాయి.  ముఖ్యంగా శివయ్య భక్తులు రాజు యాదవ్ తన భక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

కన్వరియా జాముయికి చెందిన రాజు యాదవ్.. ను ‘ఫలహారి బాబా’ అని కూడా పిలుస్తారు. రాజు యాదవ్ సంవత్సరానికి 48 సార్లు శివయ్యకు జలాభిషేకం చేస్తాడు. సుల్తాన్‌గంజ్ నుండి నీటిని తీసుకుని 105 కిలోమీటర్లు నడిచి డియోఘర్ చేరుకుంటాడు.. ఇక్కడ శివయ్యకు జలాభిషేకం చేస్తాడు. ఈ సమయంలో ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షను చేపడతారు. ప్రతి నెలా నాలుగు సార్లు ఇలా శివయ్యకు జలాభిషేకం చేస్తాడు.

గత 40 ఏళ్లుగా అన్నం తినని రాజు యాదవ్..  రాజు యాదవ్ గత 40 ఏళ్లుగా ఆహారం తీసుకోలేదు. కనుకనే ఇతడిని ముద్దుగా అందరూ  ‘ఫలహారి బాబా’ అంటారు. పండ్లు, పాలు, షర్బత్ మాత్రమే ఆహారంగా తీసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే ఇప్పుడు రాజు యాదవ్ ఆహారం తీసుకుంటే చనిపోవచ్చు అని చెబుతున్నారు. ఎందుకంటే అతని శరీరం ఆహారాన్ని జీర్ణించుకోలేని విధంగా మారింది. ఇప్పుడు కన్వరి యాత్రలో ‘ఫలాహరి బాబా’ పాల్గొన్నాడు. ప్రస్తుతం భక్తులందరూ ఆయన భక్తిని, విశ్వాసాన్ని కొనియాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

‘సురాహి బాబా’ అని కూడా ప్రసిద్ధి ఒకవైపు కణ్వరియాలు కావడి బిందెలతో నీటిని తీసుకుని శివయ్యకు నీరుని సమర్పించడానికి ఆసక్తిని చూపిస్తే.. మరోవైపు, ‘ఫలహారి బాబా’ సుల్తాన్‌గంజ్ నుండి మట్టి కూజాలో నీటిని తీసుకుని డియోఘర్ చేరుకుని బాబాకు ఆ కూజాలోని నీళ్ళు సమర్పిస్తాడు. ఇలా కూజా నుండి నీటిని సమర్పించడానికి కూడా ఒక రీజన్ ఉంది. శివయ్యకు చల్లని నీరు చాలా ఇష్టమని..  కూజాలోని నీరు చల్లగా ఉంటుంది కనుక తాను శివయ్యకు కుజాతో నీటిని సేకరించి అభిషేకం చేస్తానని చెప్పాడు.

అంతేకాదు మట్టి కుండలోని నీరు అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది. కనుక ఒక కూజాలో నీటిని తీసుకువెళ్లి శివయ్యకు అభిషేకం చేస్తాడు. తాను 40 ఏళ్లుగా ఆహారంగా పండ్లను మాత్రమే తీసుకుంటానని.. తనకు తన వయసు కూడా గుర్తుకు రావడం లేదని ఫలాహరి బాబా చెప్పారు.  తన జీవితం శివయ్య సేవలో గడిపేస్తానని చెప్పాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).