Sravana Masam: ఈ ఏడాది జంట శ్రవణాలు.. మంగళవారాలు ఆంజనేయ పూజ ఫలవంతం.. నిజ శ్రావణం ఎప్పుడంటే..
శ్రావణ మాసంలో సంకటమోచన హనుమంతుడిని ఆరాధించడం వలన సాధకుల బాధలు పోతాయి.. కోరికలు నెరవేరుతాయి. శివుడితో పాటు హనుమంతుడి అనుగ్రహం వలన జీవితంలో ఎలాంటి భయం ఉండదు. హనుమంతుడు ప్రతి యుగంలో ఉన్నాడు. తన భక్తులను రక్షించడానికి ఒక పిలుపుతో పరిగెత్తుకు వస్తాడని విశ్వాసం. కనుక శ్రావణ మాసంలో మంగళవారం ఆంజనేయస్వామిని పూజించడం వల్ల మనిషి జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి కోరికలన్నీ నెరవేరతాయని విశ్వాసం.

శ్రావణ మాసం పుజాలను, శుభకార్యాలను జరుపుకునే పవిత్ర మాసం. ఈ మాసంలో మహిళలు మంగళగౌరి వ్రతాన్ని శివయ్యను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ముఖ్యంగా శివుడు ఈ నెలలో సముద్రంలో పుట్టిన హాలాహలాన్ని మింగి తన కంఠంలో దాచి గరళకంఠుడిగా మారిన నెల అని భక్తుల విశ్వాసం. కనుక ఈ నెలలో శివునికి ప్రత్యేక పూజలను చేస్తే అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అయితే ఈ మాసంలో శివుడి రుద్రావతారంగా భావించే హనుమంతుడి పూజకు కూడా విశిష్ట స్థానం ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం, శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజున ఎవరైనా శివునితో పాటు హనుమంతుడ్ని పూజిస్తే అతని కోరికలు అన్నీ తీరతాయని విశ్వాసం. శ్రావణ మాసంలోని మంగళవారాలలో చేసే హనుమంతుడి పూజ మతపరమైన ప్రాముఖ్యత , దానికి సంబంధించిన చర్యలను గురించి ఈ రోజు తెలుసుకుందాం.
హనుమంతుడి పూజ ప్రాముఖ్యత పురాణాల ప్రకారం, శ్రావణ మాసంలో సంకటమోచన హనుమంతుడిని ఆరాధించడం వలన సాధకుల బాధలు పోతాయి.. కోరికలు నెరవేరుతాయి. శివుడితో పాటు హనుమంతుడి అనుగ్రహం వలన జీవితంలో ఎలాంటి భయం ఉండదు. హనుమంతుడు ప్రతి యుగంలో ఉన్నాడు. తన భక్తులను రక్షించడానికి ఒక పిలుపుతో పరిగెత్తుకు వస్తాడని విశ్వాసం. కనుక శ్రావణ మాసంలో మంగళవారం ఆంజనేయస్వామిని పూజించడం వల్ల మనిషి జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోయి కోరికలన్నీ నెరవేరతాయని విశ్వాసం.
అయితే ఈ ఏడాది జంట శ్రావణ మాసాలు వచ్చాయి. కనుక తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది అధిక శ్రావణ మాసం జూలై 18వ తేదీ మంగళవారం ప్రారంభమై ఆగస్టు 16వ తేదీ బుధవారంతో ముగుస్తుంది.




18 జూలై 2023 – మొదటి మంగళవారం 25 జూలై 2023 – రెండవ మంగళవారం 01 ఆగస్టు 2023 – మూడవ మంగళవారం 08 ఆగస్టు 2023 – నాల్గవ మంగళవారం 15 ఆగస్టు 2023 – ఐదవ మంగళవారం
నిజ శ్రావణ మాసం ఆగస్టు 17వ తేదీ గురువారం ప్రారంభమై సెప్టెంబర్ 15వ తేదీ శుకవారం ముగుస్తుంది. 22 ఆగస్ట్ 2023 – ఆరవ మంగళవారం 29 ఆగస్టు 2023 – ఏడవ మంగళవారం
5 సెప్టెంబర్ 2023- ఎనిమిదవ మంగళవారం
12 సెప్టెంబర్ 2023- తొమ్మిదివ మంగళవారం
హనుమంతుడిని ఎలా పూజించాలంటే శ్రావణ మాసంలో హనుమంతుడి ఆరాధన శుభ ఫలితాలను పొందడానికి, ఈ నెలలో మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నాన-ధ్యానం తర్వాత హనుమంతుడి ఆలయానికి వెళ్లండి లేదా ఇంట్లోనే నియమ నిష్టలతో ఆంజనేయ స్వామిని పూజించండి. హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ మాసంలోని మంగళవారాల్లో సింధూరాన్ని సమర్పించండి. సుందరకాండను పఠించండి. లేదా హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించండి. కోరుకున్న వరం పొందాలంటే శ్రావణ మాసంలో మంగళవారం నాడు ఎరుపు రంగు పూలు, బెల్లం, శనగలు , తులసి, వడపప్పు సమర్పించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).




