Vastu Direction: ఈ వాస్తు నియమాన్ని పాటిస్తే పేదరికం తొలగిపోతుంది! డబ్బుకు లోటు ఉండదు..
వంటగది, బాత్‌రూమ్, ఇంటి మెయిన్ డోర్ నుంచి బెడ్‌రూమ్ వరకు వాస్తు నియమాలు పాటించడం చాలా ముఖ్యం. ఇంటి వాస్తు సరిగ్గా లేకుంటే సానుకూల ఫలితాలు కాకుండా ప్రతికూల అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ఇంట్లో వాడే చీపురు సరైన స్థానంలో ఉండటం చాలా ముఖ్యం, చీపురులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కాబట్టి దీనిని ఎల్లప్పుడూ ఇంటికి వాయువ్య దిశలో ఉంచాలి.
Vastu Direction: చక్కని ఇల్లు సొంతం చేసుకోవడం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి కల. మనలో చాలామంది కోరుకునేది ఇదే. ఇల్లు కట్టుకునేటప్పుడు డెకరేషన్ కు సంబంధించిన విషయానికి అందరూ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ వారు దీనికి సంబంధించిన ముఖ్యమైన వాస్తవాలను విస్మరిస్తారు. వంటగది, బాత్‌రూమ్, ఇంటి మెయిన్ డోర్ నుంచి బెడ్‌రూమ్ వరకు వాస్తు నియమాలు పాటించడం చాలా ముఖ్యం. ఇంటి వాస్తు సరిగ్గా లేకుంటే సానుకూల ఫలితాలు కాకుండా ప్రతికూల అంశాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ఇది వాస్తు దోషాల వల్ల వస్తుంది. అందుకే ఇంట్లో పడకగది నుండి పూజ గది, వరండా వరకు వాస్తు దోషాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మీరు కొన్ని దశలను అనుసరించడం ద్వారా వాస్తు దోషాలను సరిచేయవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
– పూజా గది, బాల్కనీ, వరండా, ట్యాంక్, బావి, మెయిన్ హాల్ గది, వర్షపు నీరు ప్రవహించే ఈశాన్య దిశలో చాలా అనుకూలంగా ఉంటాయి.
– భగవంతుడు ఈ దిక్కున ఉంటాడు. కాబట్టి ఈశాన్య మూలను చాలా అందంగా అమర్చుకోవాలి.
– ఈశాన్యంలో తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
– ఇంట్లో ఈశాన్య మూలలో వేణువును ఉంచడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వేణువును పట్టుకుని వాయించడం వల్ల వాస్తు దోషం తొలగిపోయి, దారిద్య్రం తొలగి ఐశ్వర్యం పెరుగుతుంది.
– శంఖం ఉన్న ఇంట్లో ఆనందం-ఐశ్వర్యం అధికంగా ఉంటుంది. లక్ష్మీదేవి కొలువై ఉండే శంఖం గురించి మీరు వినే ఉంటారు. ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు.
– ఇంట్లో వాడే చీపురు సరైన స్థానంలో ఉండటం చాలా ముఖ్యం, చీపురులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కాబట్టి దీనిని ఎల్లప్పుడూ ఇంటికి వాయువ్య దిశలో ఉంచాలి.
Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..