Hair Treatment: జుట్టు సమస్యలా..? చింత ఆకులతో ఇలా ప్యాక్‌ చేసి వాడి చూడండి.. చింతలన్నీ పరార్‌..

ఈ ఆకులను మెంతి గింజలతో కలిపి గ్రైండ్ చేయండి. ఇప్పుడు మీరు ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు రాసుకోవచ్చు. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత వాష్‌ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే క్రమంగా మీ తెల్లజుట్టు నల్లబడుతుంది. జుట్టు రాలటం సమస్య కూడా తగ్గిపోతుంది. జుట్టు పెరగటం చూస్తారు.

Hair Treatment: జుట్టు సమస్యలా..? చింత ఆకులతో ఇలా ప్యాక్‌ చేసి వాడి చూడండి.. చింతలన్నీ పరార్‌..
Healthy Hairs
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 04, 2023 | 7:04 AM

మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మనిషి జీవితంలో అనేక సహజ మార్పులు చూస్తుంటాం. దీంతో పాటు మన శరీరంలో కూడా పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ విషయాలన్నింటికీ ఆహారం, హార్మోన్లు ప్రధాన కారణం. అంతేకాదు.. జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తెల్లజుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలను మనం ఎదుర్కోవలసి వస్తుంది. రోజువారీ కెమికల్ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల వెంట్రుకలు బలహీనపడి తెల్లగా మారుతాయి. కాబట్టి మీరు మీ జుట్టును నల్లగా, ఒత్తుగా ఉండాలంటే.. కొన్ని హోం రెమెడీస్ ఉపయోగించవచ్చు. చింతచెట్టు సహాయంతో ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడవచ్చు. అదేలాగో తెలుసుకుందాం..

ఉసిరి, చింతచెట్టు ఆకులు జుట్టుకు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. దీని కోసం మీరు తాజా ఉసిరి, కొన్ని చింతచెట్టు ఆకులను తీసుకోవాలి. తర్వాత ఉసిరి కాయలను కోసి చింతఆకుతో మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను తలస్నానం చేసే ముందు జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల మీ తెల్లజుట్టు సమస్య త్వరగా తీరిపోతుంది.

పెరుగు, చింతపండు ఆకులను ఉపయోగించి మీ జుట్టుకు హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇది మీ నెరిసిన జుట్టును నల్లగా మార్చటంలో సహాయపడుతుంది. దీని కోసం, మీరు పెరుగుతో కొన్ని చింతచెట్టు ఆకులను మిక్స్ చేసి, మీ జుట్టుకు ప్యాక్‌లా అప్లై చేయండి. 1 గంట పాటు అలాగే వదిలేసి.. తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. మీరు కొద్ది రోజుల్లోనే గొప్ప మార్పును చూస్తారు.

ఇవి కూడా చదవండి

మెంతులు కూడా జుట్టుకు చాలా మేలు చేస్తాయి. మెంతి గింజలను ఒక చిన్న కంటైనర్‌లో రాత్రంతా నానబెట్టండి. ఉదయం నిద్రలేచిన తర్వాత, దాని నీటిని వడకట్టండి. చింత ఆకులను మెంతి గింజలతో కలిపి గ్రైండ్ చేయండి. ఇప్పుడు మీరు ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు రాసుకోవచ్చు. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత వాష్‌ చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే క్రమంగా మీ తెల్లజుట్టు నల్లబడుతుంది. జుట్టు రాలటం సమస్య కూడా తగ్గిపోతుంది. జుట్టు పెరగటం చూస్తారు.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం ఆరోగ్య నిపుణులు తెలిపిన సూచనల ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని TV9 తెలుగు ధృవీకరించడంలేదు. నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దీనిని అనుసరించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి