Male Fertility: సంతానం కోరుకునే పురుషులకు హెచ్చరిక.. వీటిని తిన్నారంటే మీ కలలన్నీ కల్లలయినట్లే..!
Male Fertility: కుటుంబ, ఉద్యోగ బాధ్యతలతో సతమతమవుతున్న మానవాళీని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యల్లో సంతానలేమి కూడా ప్రధానమైనది. తినడానికి తీరిక లేకపోవడం, సమయానికి ఏది కనిపిస్తే దాన్ని తినడం కారణంగా ఎందరో పురుషులు శృంగార కోరికలు, లైంగిక సామర్థ్యం..
Male Fertility: కుటుంబ, ఉద్యోగ బాధ్యతలతో సతమతమవుతున్న మానవాళీని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యల్లో సంతానలేమి కూడా ప్రధానమైనది. తినడానికి తీరిక లేకపోవడం, సమయానికి ఏది కనిపిస్తే దాన్ని తినడం కారణంగా ఎందరో పురుషులు శృంగార కోరికలు, లైంగిక సామర్థ్యం లోపించి సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా లేదా వీటిని దూరం చేసుకోవడానికి కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవడం మానేయాలని నిపుణులు చెబుతున్నారు. వాటిని తినడం వల్ల మనిషి మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడడంతో పాటు వారి లైంగిక కోరికలు, స్పెర్మ్ కౌంట్ కూడా చెడుగా ప్రభావితం అవుతాయంట. ముఖ్యంగా పురుషుల్లో శంగార కోరికలను రేకెత్తింటే టెస్టోస్టిరాన్ ప్రభావం లోపించేలా చేస్తాయి. మరి ఈ క్రమంలో పిల్లలు కావాలనుకునేవారు దూరం పెట్టాల్సిన ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రాసెస్‌డ్ మాంసం: శరీరానికి ప్రోటీన్ ఫుడ్ అవసరం, దాని కోసం మాంసం ఉత్తమమైన ఎంపిక. అయితే అందుకోసం తాజా మాంసాన్ని మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా మార్కెట్‌లో లభించే ప్రాసెస్డ్ మాంసం తీసుకోకండి. ఇది సంతానోత్పత్తి వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. ఇంకా ఇది జీర్ణమవడానికి ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల మీలోని కోరికలకు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది.
కూల్ డ్రింక్స్: సందర్భం లేదైనా కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండలేని వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇది పురుషులకు సరైన అభిరుచి కాదు. కూల్ డ్రింక్స్‌లో ఉండే షుగర్, కార్బోహైడ్రెట్లు స్మెర్మ్ నాణ్యతపై చెడు ప్రభావం చూపుతాయి.
టీ-కాఫీ: టీ, కాఫీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అది పరిమితంగా తీసుకున్నంత వరకే. తరచూగా టీ, కాఫీలను తీసుకోవడం వల్ల అందులోని కెఫిన్ మనలో నిద్రలేమి, పునరుత్పత్తి సమస్యలు కలిగేలా దారితీస్తుంది. పునరుత్పత్తి కణాల ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం చూపుతాయి.
జంక్ ఫుడ్: చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ తినడానికి ఇష్టపడే జంక్ ఫుడ్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరూ పట్టించుకోరు. స్ట్రీట్ ఫుడ్ గుండె, ఊభకాయం వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయడంతో పాటు మగవారిలోని పునరుత్పత్తి వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది.
మద్యపానం-ధూమపానం: ఎన్నో రకాల క్యాన్సర్లకు కారణమయ్యే మద్యం, సిగరెట్లు పురుషుల లైంగిక జీవితాన్ని కూడా నాశనం చేస్తాయి. ఎందుకంటే ఇందులోని నికొటిక్స్ పురుషున ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్: ఈ కథనంలో తెలియజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు వైద్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం.