Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest Beggar: అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు.. పైసా పైసా పోగేసి నేడు కోట్ల ఆస్తికి వారసుడు.. లగ్జరీ ఇల్లు కోట్ల ఆస్తి ఇతని సొంతం

నిజానికి కడు పేదరికంతో బాధలు పడేవాడు.. లేదా అవయవాలు లేనివారు.. పనిచేసే సత్తాలేని వారు బిచ్చగాళ్లు మారతారు. అలా బిచ్చగాడుగా మారిన భరత్ జైన్ అదే భిక్షాటనను లాభాలు అందించే వృత్తిగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇతను బిచ్చమెత్తి పోగేసిన చిల్లర డబ్బులతో కోటి 4 లక్షల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశాడు.

Richest Beggar: అత్యంత ధనవంతుడైన బిచ్చగాడు.. పైసా పైసా పోగేసి నేడు కోట్ల ఆస్తికి వారసుడు.. లగ్జరీ ఇల్లు కోట్ల ఆస్తి ఇతని సొంతం
World's Richest Beggar
Follow us
Surya Kala

|

Updated on: Jul 07, 2023 | 9:40 AM

సాధారణంగా అత్యంత ధనవంతులు అంటే బడా వ్యాపారస్తులు, లేదా సెలబ్రిటీలైనా అయి ఉండాలి. ఎవరైనా ఇలాగే అనుకుంటారు. అది సహజం కూడా. కానీ ఓ బిచ్చగాడు కేవలం బిచ్చమెత్తుకుంటూ కోట్లకు అధిపతి అయ్యాడంటే నమ్ముతారా? ఇలాంటివి సినిమాల్లోనే సాధ్యం అనుకుంటున్నారు కదా.. కాదు, నిజ జీవితంలోనూ ఇది సాధ్యమేనని నిరూపించాడు ఓ బిచ్చగాడు. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిచ్చగాడుగా నిలిచాడు. అసలు విషయానికి వస్తే..

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ట్రాఫిక్ సిగ్నళ్లు, గుళ్లల్లో చిల్ల పైసలు బిచ్చమెత్తుకుంటూ ఒక్కో రూపాయి పోగు చేసి కోట్లు సంపాదించాడు. విలువైన ఆస్తులను కూడబెట్టాడు. ఇంకా చెప్పాలంటే మంచి జీతం వచ్చే ఉద్యోగి కూడా ఈ బిచ్చగాడి సంపాదన ముందు దిగడుపే.. దీనిని బట్టి ఆ బిచ్చగాడు ఆదాయం ఏ రేంజ్‎లో ఉందో ఒక్కాసారి ఆలోచించండి.. మరి కోటీశ్వరుడైన బిచ్చగాడు దేశ ఆర్ధిక రాజధాని ముంబైకి చెందిన భరత్ జైన్.

నిజానికి కడు పేదరికంతో బాధలు పడేవాడు.. లేదా అవయవాలు లేనివారు.. పనిచేసే సత్తాలేని వారు బిచ్చగాళ్లు మారతారు. అలా బిచ్చగాడుగా మారిన భరత్ జైన్ అదే భిక్షాటనను లాభాలు అందించే వృత్తిగా మార్చుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇతను బిచ్చమెత్తి పోగేసిన చిల్లర డబ్బులతో కోటి 4 లక్షల విలువైన రెండు ఫ్లాట్లను కొనుగోలు చేశాడు. అంతే కాదు మిగతా డబ్బులను షాపుల్లో పెట్టుబడి పెట్టాడు. ఈ షాపుల ద్వారానే ప్రతి నెల భరత్‎కు 30వేల వరకు అద్దె వస్తుంది. భరత్ జైన్ నికర విలువ 7.5 కోట్ల డాలర్లు అంటే నమ్మశక్యంగా అనిపించదు. అయితే ఇది అక్షరాలా నిజం.

ఇవి కూడా చదవండి

తాజా లెక్కల ప్రకారం భారత్ జైన్ బిక్షాటనతో మాత్రమే కాదు.. అద్దెలు వాటిని వాటి ద్వారా నెలకు రూ. 1,00,000 లను సంపాదిస్తున్నట్లు అంచనావేస్తున్నారు. 2014 నాటికి భిక్షాటనతో భరత్ రోజుకి 2 వేలనుంచి 2,500 వరకూ సంపాదించేవాడు. అంటే ప్రతి నెల సుమారు రూ.  75,00,000 వరకు సంపాదించేవాడు.  అందుకే భరత్ ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ బిచ్చగాడు అయ్యాడు. భరత్ జైన్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోయాడు. దీంతో బిచ్చగాడుగా మారాడు. భిక్షాటన చేసుకుంటూనే భరత్ పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని సంపాదనతో వారిద్దరిని బాగా చదివిస్తున్నాడు. భరత్ జైన్ ఇల్లు కూడా ఆధునిక సౌకర్యాలతో ఉంటుంది. తన ఫ్యామిలీ తో కలిసి పరేల్‌లోని డ్యూప్లెక్స్ ఇంట్లో  నివసిస్తున్నాడు. భరత్ ఫుల్ సెటిల్డ్. కష్టపడకుండానే అద్దెల ద్వారా ఆదాయం లభిస్తోంది. ఇక భిక్షాటన చేయాల్సిన పనే లేదు. అయినప్పటికీ తనకు ఆదాయాన్ని ఇచ్చి జీవితాన్ని నిలబయటిన బిక్షాటనను ఎవరు ఎన్ని చెప్పినా వదలడం లేదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..