నడి వీధిలో జంటపాముల సయ్యాట..భయంతో జనం పరుగులు
స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రకాల వీడియోలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో నెట్టింట చేరిపోతోంది.. క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇటీవల జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు
స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక రకాల వీడియోలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో నెట్టింట చేరిపోతోంది.. క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇటీవల జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పాముల ఫైటింగ్, పాముల సయ్యాటకు సంబందించిన వీడియాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రెండు పాములు ఒకటిదానితో ఒకటి పెనవేసుకుని తన్మయత్వంతో సయ్యాటలు ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం లోని రామాలయం వీధిలో ఏడు అడుగుల పొడవైన రెండు జెర్రిపోతు పాములు పెన వేసుకుని కలకలం రేపాయి. జనావాసాల మధ్య జంటపాములు సయ్యాట చూసి భయబ్రాంతులకు గురైన స్థానికులు స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. స్పాట్ కు వచ్చిన స్నేక్ క్యాచర్ ఒక్క ఉదుటున వెళ్ళి పెన వేసుకుని ఉన్న రెండు పాములను పట్టుకున్నాడు. దీంతో రామాలయం వీధిలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెండు పాములను సురక్షితంగా అడవిలో వదిలేస్తానని స్నేక్ క్యాచర్ మల్లికార్జున తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాబోయే అల్లుడికి షాకిచ్చిన అత్తగారు.. దెబ్బకు వరుడు పరుగో పరుగు..
నడిరోడ్డుపై విచిత్ర సంఘటన.. ఏం జరిగిందంటే ??
రైలు సీటు కింద కనిపించిన బ్యాగ్ !! ఏంటోనని చెక్ చేయగా.. దెబ్బకు హడల్ !!
KGF లో పుట్టిన క్రూరుడే.. సలార్..
Pawan Kalyan: ఒక్క పోస్ట్ లేదు.. 2 మిలియన్ ఫాలోవర్స్.. నిజంగా.. నువ్వు దేవుడివి సామీ !!