AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కారు పై నుంచి దూసుకెళ్లిన హెలికాఫ్టర్‌.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం

కార్లు రోడ్లపైకి వెళ్తుంటాయి. విమానాలు, హెలికాప్టర్లు వంటివి గాలిలో చక్కర్లు కొడుతుంటాయి. అయితే రోడ్డపై వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురవడం సాధారణమే. కానీ గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్ రోడ్డుపై వెళ్తున్న..

కారు పై నుంచి దూసుకెళ్లిన హెలికాఫ్టర్‌.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం
Helicopter Accident
Ganesh Mudavath
|

Updated on: Oct 22, 2022 | 4:02 PM

Share

కార్లు రోడ్లపైకి వెళ్తుంటాయి. విమానాలు, హెలికాప్టర్లు వంటివి గాలిలో చక్కర్లు కొడుతుంటాయి. అయితే రోడ్డపై వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురవడం సాధారణమే. కానీ గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్ రోడ్డుపై వెళ్తున్న కారుపైకి దూసుకొస్తే.. వామ్మో.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజంగానే జరిగింది. కానీ పైలట్‌ అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపైన ఓ కారు దూసుకుపోతోంది. ఇంతలో ఎదురుగా ఓ హెలికాఫ్టర్‌ గాలిలో అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ వస్తోంది. ఆ దృశ్యం చూస్తే పెను ప్రమాదం ముంచుకొస్తుందని కనిపించింది. సరిగ్గా హెలికాఫ్టర్‌ ఆ కారు సమీపానికి వచ్చేసరికి పైలెట్‌ చాలా చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్‌ని పక్కకు తప్పించడంతో పెను ప్రమాదం తప్పింది. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఉక్రెయిన్‌లోని ఓ హైవేపై జరిగింది. అందుకు సంబంధించిన వీడియోని ఉక్రెయిన్‌ మంత్రిత్వ శాఖ ‘వెల్‌కమ్‌ టు ఉక్రెయిన్‌’ అనే క్యాప్షన్‌ని జోడించి పోస్ట్‌ చేసింది.

దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పైలెట్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం జరుగుతుంది. అదీగాక రష్యా భూ, వాయు మార్గాల్లో బాంబు దాడులను కూడా వేగవంతం చేసింది. అందువల్ల గగన తలంలోని మిసైల్‌ దాడులను తప్పించుకునేందుకు, శత్రు రాడార్‌లు గుర్తించకుండా ఉండేలా ఇలా ఉక్రెయిన్‌ పైలెట్లు తక్కువ ఎత్తులో హెలికాప్టర్‌తో పయనిస్తున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. బహుశా యుద్ధానికి సంబంధించిన ప్రాక్టీస్‌ అయ్యి ఉంటుందంటూ ట్విట్టర్‌ ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ
కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ