Photo Puzzle: మీ ఐ పవర్ సూపరా..? అయితే ఈ ఫోటోలోని పామును 10 సెకన్లలో కనిపెట్టండి
ఫోటో పజిల్స్ ట్రెండ్ సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతోంది. తాజాగా మీ ముందుకు ఓ ఆసక్తికర పజిల్ మీ కోసం తెచ్చాం. మీ ఐ పవర్ ఏ రేంజ్‌లో ఉందో చెక్ చేసుకోండి.

ఈ మధ్య సోషల్ మీడియా పేజస్‌లో పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ వీటికి బాగా ఇష్టపడుతున్నారు. ఇవి టైమ్ పాస్ పజిల్స్ మాత్రమే కాదు. మీ కళ్ల ఫోకస్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పేస్తాయి. మీ బుర్రకు కొద్దిగా మేత వేసేందుకు కూడా దోహదపడతాయి. టాస్క్ ఏదైనా సరే.. దాని లెక్క తేల్చేవరకు కొందరు విశ్రమించరు. కాస్త టైమ్ తీసుకుని అయినా దాన్ని సాల్వ్ చేస్తారు. అయితే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్స్ పరిష్కారం కనగొనడం కాస్త చిక్కుతో కూడుకున్న విషయం. ఒక్కోసారి మన బుర్ర హీటెక్కి పోతుంది. ఎంత వెతికినా ఆన్సర్ దొరకదు. చిరాకు వస్తుంది. అదే కదా మరి టఫ్ టాస్క్ అంటే. ఇక వీటికి సమాధానాలు కనుగుంటే మాత్రం సూపర్ కిక్ వస్తుంది.
ఇప్పుడు మీకు ఇవ్వబోతున్న పని ఏంటంటే.. పైన ఉన్న ఫోటోలో ఉన్న పామును మీరు గుర్తించాలి. ఆకుల మధ్య ఆ పాము నక్కి ఉంది. దమ్ముంటే తనను కనిపెట్టమని సవాల్ విసురుతుంది. అంత టఫ్ టాస్క్ ఏం కాదండి. పరీక్షగా చూస్తే ఇట్టే ఆ స్నేక్ కంటపడుతుంది. పైపైన చూస్తే మాత్రం అది మీతో రివర్స్ గేమ్ ఆడుకుంటుంది. ఇంకా క్లిష్టంగా భావించేవాళ్లకు ఓ క్లూ ఏంటంటే.. రైట్ సైడ్ ఎక్కువ ఫోకస్ పెట్టండి.
కనిపెట్టేశారా.. అయితే మీరు విన్నర్ అంతే. ఇంకా దొరకలేదు అంటే మీరు దృష్టి పెట్టి చూడనట్లే. కనీసం ప్రయత్నం కూడా చేయకుండా ఆన్సర్ కోసం వెతుకుతున్నారంటే.. మీకు కాస్త సెల్ఫ్ కాన్పిడెన్స్ తక్కువ అని భావించాలి. ఇవి చిన్న, చిన్న సవాళ్లు మాత్రమే. లైఫ్‌లో బోలెడన్ని కఠినమైన చిక్కులు ఎదురవుతాయ్. అక్కడ వాటిని స్కిప్ చేసేందుకు ఆస్కారం ఉండదు. చావైనా, రేవైనా తేల్చుకోవాల్సిందే. ఎనీ వే మీకు ఆన్సర్ ఉన్న ఫోటోను దిగువ ఇవ్వబోతున్నాం. ఈ పజిల్ మిమ్మల్ని సూపర్ థ్రిల్ చేసిందని భావిస్తున్నాం. నెక్ట్స్ టైమ్ ఇంకో క్రేజీ పజిల్‌తో మీ ముందుకు వస్తాం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..