Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కరెన్సీ నోట్లను దొంగిలిస్తున్న కాకి..! వీడియో చూసి పరేషాన్ అవుతున్న నెటిజన్లు..

Viral Video: పక్షులలో కాకి తెలివైనదని చిన్నప్పటి నుంచే వింటున్నాం. కుండలో గులకరాళ్లు వేసి నీళ్లు తాగే కథను అందరు వినే ఉంటారు. తాజాగా ఇప్పుడు

Viral Video: కరెన్సీ నోట్లను దొంగిలిస్తున్న కాకి..! వీడియో చూసి పరేషాన్ అవుతున్న నెటిజన్లు..
Crow
Follow us
uppula Raju

|

Updated on: Sep 04, 2021 | 3:55 PM

Viral Video: పక్షులలో కాకి తెలివైనదని చిన్నప్పటి నుంచే వింటున్నాం. కుండలో గులకరాళ్లు వేసి నీళ్లు తాగే కథను అందరు వినే ఉంటారు. తాజాగా ఇప్పుడు ఓ కాకి వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. సినిమాలలో విలన్స్ చేసే చాలా చోరీలను మీరు చూసి ఉంటారు. కానీ ఒక కాకి దొంగతనం చేయడం ఎప్పుడైనా చూశారా.. అవును మీరు విన్నది నిజమే. ఒక తెలివైన కాకి చేసిన చోరీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీడియోలో ఓ కాకి కిటికీ ద్వారా ఒక ఫ్లాట్‌లోకి చొరబడటం మనం చూడవచ్చు. నేరుగా అది ఒక టేబుల్‌పై వాలుతుంది. ఆ టేబుల్‌కి ఉండే డెక్స్‌ ఒకటి కొంచెం తెరుచుకొని ఉంటుంది. అందులో కరెన్సీ నోట్లు ఉంటాయి. వాటిని గమనించిన కాకి ముక్కుతో నోట్లను పట్టుకొని గాల్లోకి ఎగిరి కిటికీ ద్వారా బయటికి వెళ్లడం మనం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో బెస్ట్‌ వైరల్ వీడియో అనే ఖాతా నుంచి షేర్ చేశారు. తొమ్మిది గంటల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు.

ఇప్పటివరకు పద్దెనిమిది వందల మంది ఈ వీడియోను లైక్ చేసారు. అదే సమయంలో చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకవ్యక్తి ఆ కాకి నా దగ్గర ఉంటే ఏటీఎంగా ఉపయోగించుకుంటానన్నారు. ఇంకొకరు ఇలాంటి కాకులు కూడా ఉంటాయా అంటూ ఆశ్చర్యపోయారు. మరికొంతమంది పక్షులతో కూడా జాగ్రత్తగా ఉండాలంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనప్పటికీ కాకి వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

West Bengal: దసరా ఉత్సవాలకు రెడీ అవుతున్న పశ్చిమ బెంగాల్.. అమ్మవారి విగ్రహంలో సీఎం రూపం.. మండిపడుతున్న హిందువులు

Crime: సోషల్‌ మీడియాలో యువకుడి వెకిలిచేష్టలు.. మహిళగా నటిస్తూ.. అమ్మాయిలను ఏం చేస్తున్నాడంటే..?

Mahesh Babu: బాలీవుడ్ స్టార్‌తో కలిసి నటించనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. యాడ్ షూట్ లీక్..