West Bengal: దసరా ఉత్సవాలకు రెడీ అవుతున్న పశ్చిమ బెంగాల్.. అమ్మవారి విగ్రహంలో ‘మమత’ రూపం.. మండిపడుతున్న హిందువులు
West Bengal: హిందువుల పండగలు అంటేనే.. సందడి సరదా.. దేశ విదేశాల్లోని హిందువులు ఎంతో ఘనంగా హిందూ పండగలను జరుపుకుంటారు. అదే విధంగా వినాయక చవితి..
West Bengal: హిందువుల పండగలు అంటేనే.. సందడి సరదా.. దేశ విదేశాల్లోని హిందువులు ఎంతో ఘనంగా హిందూ పండగలను జరుపుకుంటారు. అదే విధంగా వినాయక చవితి అంటే మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, శ్రీరమ నవమి అంటే భద్రాచలం, దసరా అంటే మైసూర్, పశ్చిమ బెంగాల్ లు వెంటనే గుర్తుకొస్తాయి. దసరా ఉత్సవాలను పశ్చిమ బెంగాల్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కరోనా రాక ముందు వరకూ ఇక్కడ జరిగే ఉత్సవాలను చూడడనికి విదేశీయులు కూడా వచ్చేవారు. అయితే ఈ దసరా ఉత్సవాలు రాజకీయాలకు వేదికగా మారిపోయాయని కొంతమంది సనాతన వాదులు వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఎన్నికల్లో బీజేపీ జై శ్రీరామ్ అంటే.. తృణ మూల్ కాంగ్రెస్ జై కాళీ అంటూ ఎలక్షన్ల బరిలోకి దిగింది. మమతా బెనర్జీ తిరిగి సీఎం గా అధికార పీఠాన్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు దసరా ఉత్సవాలకు దీదీ అభిమానులు రెడీ అవుతున్నారు. గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి మమతా అభిమానులు అమ్మవారి విగ్రహాల్లో సీఎం మమత రూపురేఖలు దిద్దుతూ ఉత్సవాలకు నిలబెట్టే దేవతా విగ్రహాలను తయారు చేస్తున్నారు.ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని కమిటీలు కూడా వేశారు.
అంటే దుర్గామాత విగ్రహాల్లో కచ్చితంగా సీఎం మమతా బెనర్జీ విగ్రహాన్ని పెట్టడమే వీరి పని అన్నమాట. అయితే హిందువులు కొలిచే దుర్గామాత విగ్రహంలో సీఎం రూపురేఖలు తీర్చిదిద్దడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కరెక్ట్ కాదని.. దుర్గమ్మ విగ్రహం బదులు పందిట్లో మమతా విగ్రహం పెడితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు.
Bharat Army: ఆర్మీ శిక్షణలో భగవద్గీత, కౌటిల్యుడి అర్ధశాస్త్రం.. సీడీఎం ప్రతిపాదనపై కస్సుమంటున్న కాంగ్రెస్ నేతలు..