Viral: ఆ స్కూలంతా కుప్పలు తెప్పలుగా పాములే పాములు.. ధైర్యమున్నోడు కూడా దడుసుకోవాల్సిందే
ప్రస్తుతం బీహార్ పాఠశాలలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. విద్యార్ధులే అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం విశ్రాంతి తీసుకుంటున్నారని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో హాట్ టాపిక్‌గా మారాయి బీహార్ స్కూల్స్.
ప్రస్తుతం బీహార్ పాఠశాలలు సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. విద్యార్ధులే అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు సైతం విశ్రాంతి తీసుకుంటున్నారని రూమర్స్ వస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో హాట్ టాపిక్‌గా మారాయి బీహార్ స్కూల్స్. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 44 పాములు ఓ పాఠశాలలో బయటపడ్డాయి. కతిహార్ జిల్లాలో ఉన్న ఆ స్కూల్‌లో నాలుగు రోజులుగా పాములు నిరంతరం బయటకు వస్తూనే ఉన్నాయి. ఇలా కుప్పలు తెప్పలుగా పాములు రావడంతో పాఠశాలకు వస్తున్న విద్యార్ధులే కాదు టీచర్లు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇది చదవండి: పెదవుల ఆకారం మీ స్వభావం, వ్యక్తిత్వాన్ని చెబుతుందట.. ఎలాగో తెల్సా
అసలే ఇది వర్షాకాలం. బీహార్ రాష్ట్రమంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అయితే వరదల కారణంగా చాలా ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని బార్సోయ్ బ్లాక్‌లోని బల్తార్ పంచాయతీ మనోహరి ఉన్నత పాఠశాలలో గత నాలుగు రోజులుగా పాములు నిరంతరం బయటకు వస్తున్నాయి. తొలుత స్వయంగా పాఠశాల ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ పాములను రక్షించి బాక్సుల్లో ఉంచారు. అయితే, పాములు ఎక్కువ సంఖ్యలో బయటకు రావడంతో, ఆయన గత శనివారం పశ్చిమ బెంగాల్ నుంచి పాములు పట్టేవాడిని పిలిపించారు.
ఇది చదవండి: మీ అబ్బాయి ప్రేమలో పడ్డాడో.. లేదో..? తెలుసుకోండిలా.. ఈ లక్షణాలు కనిపిస్తే
అతడు పాఠశాలకు చేరుకుని పాములను ఒక్కొక్కటిగా బయటకు తీయడంతో.. ఏకంగా 44 పాములు బయటకొచ్చాయి. ఒక్కసారిగా ఇన్ని పాములు బయటపడటంతో పాఠశాలను పూర్తిగా మూసివేసినట్లు ప్రధానోపాధ్యాయుడు రాజేష్ కుమార్ షా తెలిపారు. కుప్పలుగా పాములు ప్రతీ చోటా దర్శనమివ్వడంతో పిల్లలతో పాటు ఉపాధ్యాయులు కూడా భయపడ్డారు. ఇక ఇదే స్కూల్ నుంచి గతేడాది కూడా 36 పాములు బయటపడ్డాయి. వర్షాకాలంలో ప్రతీ ఏటా ఇలా పాములు రావడంతో పిల్లల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు.
ఇది చదవండి: చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా.. గుండె ఆగినంత పనైంది
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి