Telangana: వారు చేతకాని దద్దమ్మలు.. బండారం బయటపడుతుందని భయపడుతున్నారు.. ఆ నాయకులపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
టీఆర్ ఎస్ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల, తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న ఆమె జడ్చర్ల నియోజకవర్గంలో యాత్ర ముగించుకుని షాద్ నగర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. రామేశ్వరం వద్ద..
Telangana: టీఆర్ ఎస్ పార్టీపై మరోసారి ఫైర్ అయ్యారు YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల, తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న ఆమె జడ్చర్ల నియోజకవర్గంలో యాత్ర ముగించుకుని షాద్ నగర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. రామేశ్వరం వద్ద వైఎస్.షర్మిలకు పార్టీ నాయకులు, గ్రామస్థులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా టీఆర్ ఎస్ నాయకులపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ఎమ్మెల్యేలు చేతకాని దద్దమ్మలంటూ విమర్శించారు. అవినీతిని ప్రశ్నించినందుకు తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తారా అని మండిపడ్డారు. తాను మాట్లాడిన చిన్న పదాన్ని పట్టుకుని.. దాంతో వారి గౌరవానికి భంగం వాటిలినట్లు స్పీ్కర్ ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. టీఆర్ ఎస్ నాయకుల అవినీతి గురించి మాట్లాడకూడదా అన్నారు. తెలంగాణలో తన పాదయాత్ర జరగకుండా.. ఆపేందుకు కుట్ర చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వైఎస్.షర్మిల.
తన పాదయాత్రతో టీఆర్ ఎస్ నాయకుల బండారం బయటపడుతుందనే భయం అధికారపార్టీ నాయకుల్లో పట్టుకుందన్నారు వైఎస్.షర్మిల. దమ్ముంటే తన పాదయాత్రను ఆపాలని ఆమె టీఆర్ ఎస్ కు సవాల్ విసిరారు. ఎలా పాదయాత్ర ఆపుతారో తాను చూస్తానంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే టీఆర్ ఎస్ నాయకులపై అనేక సందర్బాల్లో షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. అధికార పార్టీ నాయకుల అవినీతికి అంతు లేకుండా పోయిందంటూ తెలిపారు. ఈనేపథ్యంలో టీఆర్ ఎస్ నాయకులకు, షర్మిల పార్టీకి మధ్య గత కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈనేపథ్యంలో తన పాదయాత్రలో భాగంగా వైఎస్.షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..