Abhaya Hastham: అభయ హస్తం పథకాన్ని పునఃప్రారంభించండి.. సర్కార్‌కు షర్మిల డిమాండ్..

Abhaya Hastham Scheme: తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకునేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వైఎస్ఆర్‌టిపి వదులుకోవడం లేదు.

Abhaya Hastham: అభయ హస్తం పథకాన్ని పునఃప్రారంభించండి.. సర్కార్‌కు షర్మిల డిమాండ్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 01, 2022 | 8:28 PM

Abhaya Hastham Scheme: తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకునేందుకు వచ్చే ఏ అవకాశాన్ని వైఎస్ఆర్‌టిపి వదులుకోవడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తెలంగాణ రాజన్న రాజ్యం కనుమరగైందన్నారు. పేదల పక్షపాతిగా వైఎస్ఆర్ తీసుకువచ్చిన పథకాలను రద్దు చేశారంటూ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె.. వైఎస్ఆర్ తీసుకువచ్చిన అభయ హస్తం పథకాన్ని మళ్లీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పొదుపు సంఘాలను బలోపేతం చేయడానికి, మహిళలకు అండగా ఉండేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన అభయ హస్తం పథకాన్ని తెలంగాణ సర్కార్ నీరుగార్చిందని దుయ్యబట్టారు. 2017 వరకు అమలైన ఈ పథకంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ పథకాన్ని ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. మహిళలకు ఆర్థిక భరోసా లేకుండా చేశారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభయం హస్తం పథకాన్ని మరోసారి అమలు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.

Also read:

Supreme Court: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టులో ఊరట..!

Andhra Pradesh: రాజధాని ఎక్కడో చెబితే కార్యాలయం పెడతాం.. ఆర్బీఐ లేఖ..

Handball Academy: హైదరాబాద్‌లో అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ అకాడమీ..