Handball Academy: హైదరాబాద్‌లో అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ అకాడమీ..

Handball Academy: భారత హ్యాండ్‌బాల్‌కు భాగ్యనగరం హబ్‌ కాబోతోంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌

Handball Academy: హైదరాబాద్‌లో అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ అకాడమీ..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 01, 2022 | 7:58 PM

Handball Academy: భారత హ్యాండ్‌బాల్‌కు భాగ్యనగరం హబ్‌ కాబోతోంది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ అకాడమీ ఏర్పాటుకు అన్నీ విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ఇంటర్నేషనల్‌ హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్ (ఐహెచ్ఎఫ్‌) ముందుకొచ్చింది. భారత్ లో హ్యాండ్‌బాల్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఐహెచ్ఎఫ్‌ ప్రెసిడెంట్‌ హసన్ ముస్తఫాతో జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు సౌదీ అరేబియాలో మంగళవారం భేటీ అయ్యారు.

దేశంలో హ్యాండ్‌బాల్‌ క్రీడకు అవసరమైన అవస్థాపన సౌకర్యాల కల్పన, కోచ్ ల సంఖ్య పెంపు, భారత్ కు అంతర్జాతీయ టోర్నమెంట్ల కేటాయింపు ఏజెండాగా ఈ సమావేశం జరిగింది. జగన్ మోహన్ రావు విజ్ఞప్తులను సావధానంగా ఆలకించిన ముస్తఫా పలు రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ లో హ్యాండ్‌బాల్‌ పురోగతికి కూడా తమ వంతు సహకారమందిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నిర్మించాలని చూస్తున్న అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ అకాడమీ ఏర్పాటుకు నిధులు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతర అంశాల్లో తోడ్పాటు అందించేందకు ముస్తఫా సుముఖత వ్యక్తం చేశారు.

అలానే దేశంలోని 500 మంది కోచ్ లకు హ్యాండ్‌బాల్‌ కొత్త నియమాలు, గేమ్‌ టెక్నిక్స్‌పై తర్ఫీదును ఇచ్చేందుకు ఆన్ లైన్ శిక్షణ సమావేశాల ఏర్పాటు, ఈ ఏడాది చివర్లో ఆసియా బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీలకు భారత్ ఆతిథ్య హక్కులు కేటాయింపునకు కూడా ముస్తఫా అంగీకరించారు. ఈ సమావేశంలో భారత ఒలింపిక్‌ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్‌ పాండే, ఆసియా హ్యాండ్‌బాల్‌ ఫెడరేషనన్ ఈడీ అహ్మద్‌ అబు అల్‌ లైల్‌ పాల్గొన్నారు.

Also read:

Guntur Jinnah Tower: గుంటూరులోని జిన్నా టవర్ కు జాతీయ జెండా రంగులు.. 3వ తేదీన..

Motorola Edge 30 Pro: మోటోరోలా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. 60 ఎంపీ కెమెరాతో పాటు అదిరిపోయే ఫీచర్లు..

Realme: హృదయ స్పందన కొలిచే ఫీచర్‌తో వస్తున్న రియల్‌మి 9 ప్రో ప్లస్.. 5G సపోర్ట్ కూడా..?