Supreme Court: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేకు సుప్రీం కోర్టులో ఊరట..!
అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లోక్ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు, పంజాబ్ ఎమ్మెల్యే సిమర్‌జిత్ సింగ్ బైయిన్స్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది.
Supreme Court on mla Simarjeet Singh Bains: అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లోక్ ఇన్సాఫ్ పార్టీ(Lok Insaaf Party) అధ్యక్షుడు, పంజాబ్ ఎమ్మెల్యే సిమర్‌జిత్ సింగ్ బైయిన్స్(Imarjeet Singh Bains)కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది . మంగళవారం ఈ కేసును విచారించగా, బెయిన్స్ అరెస్టుపై సుప్రీంకోర్టు(Supreme Court) ఫిబ్రవరి 3 గురువారం వరకు స్టే విధించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం బెయిన్స్ అరెస్టుపై స్టే విధించడంతో పాటు కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఈ కేసులో లూథియానా కోర్టు ఆదేశాలను బెయిన్స్ సవాలు చేశారు. ఈ కేసులో అతను కోర్టుకు హాజరుకాకపోవడంతో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఈ వ్యవహారంతో మహిళా ఫిర్యాదుదారు దరఖాస్తును కూడా సుప్రీంకోర్టు జత చేసింది. ఎమ్మెల్యే తరుపున ఈ వ్యవహారాన్ని ఎన్నికలతో ముడిపెట్టారని, అయితే ఎన్నికలతో సంబంధం లేదని, తన వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో బెయిన్స్ తరఫున న్యాయవాది వాదనలను పరిగణనంలోకి తీసుకున్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అసలేం జరగిందంటే..? గతేడాది సిమర్‌జిత్ సింగ్‌పై అత్యాచారం, సాక్ష్యాలను తారుమారు చేయడం, నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు ఆత్మనగర్ ఎమ్మెల్యేతో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. 44 ఏళ్ల మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. తనకు ఆర్థిక సహాయం చేస్తాననే నెపంతో బెయిన్స్ తన కార్యాలయంలో తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆ మహిళ తన ఫిర్యాదులో, “తన భర్త మరణించిన తరువాత, తన కొడుకు వ్యాపారం దాదాపు ఆగిపోవడంతో తన ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంది. అతని ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమని అడగడం ప్రారంభించాడు. అప్పుడు ఎవరో అతన్ని బైయిన్స్‌కి పరిచయం చేశారు. ఆర్థిక సాయం చేస్తానన్న నెపంతో తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే, తనపై మహిళ చేసిన ఆరోపణలను బెయిన్స్ గతంలో ఖండించారు. తాను వితంతువు, అత్యాచార బాధితురాలినని, తనకు న్యాయం చేయాలంటూ ఏడాదికి పైగా ఇంటింటికీ తిరుగుతున్నానని ఫిర్యాదుదారు కోర్టు ముందు సమర్పించారు.