AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ఇలా తయారయ్యారేంట్రా..! టీ చేతికి ఇవ్వలేదని ఇంత దారుణమా..?

సాధారణంగా హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం. కానీ, కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్‌పై.. అడ్డుకున్న సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులో వెలుగు చూసింది.

Video Viral: ఇలా తయారయ్యారేంట్రా..! టీ చేతికి ఇవ్వలేదని ఇంత దారుణమా..?
Youths Attacked Dhaba
P Shivteja
| Edited By: |

Updated on: Jan 24, 2026 | 3:18 PM

Share

సాధారణంగా హోటల్‌కు వెళ్తే ఆర్డర్ చేసిన పదార్థం ఆలస్యమైతే అసహనం వ్యక్తం చేయడం సహజం. కానీ, కొందరు యువకులు టీ ఆర్డర్ చేసినప్పుడు అది తెచ్చి ఇవ్వలేదు అని ఏకంగా హోటల్‌పై.. అడ్డుకున్న సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసింది. మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ శివారులోని క్లాసిక్ దాబాపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మనోహరాబాద్ గ్రామానికి చెందిన కొందరు యువకులు క్లాసిక్ దాబా వద్ద టీ తాగడానికి వచ్చారు. అయితే ఆ డాబాలో టీ సెల్ఫ్ సర్వీస్ ఉందని, సిబ్బంది చెప్పార. అయితే తమకు టీ సర్వ చేయడం లేదని ఆగ్రహం చెందిన నలుగురు యువకులు నిర్వాహకులతో గొడవకు దిగారు. ఇదే క్రమంలో తమ స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో మరికొంతమంది యువకులు అక్కడికి చేరుకుని విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

హోటల్లోని ఫర్నిచర్ ధ్వంసం చేసి, తిను బండారాలను నేలపాలు చేశారు. అడ్డుకున్న హోటల్ సిబ్బందిపై దాడులు చేస్తుండడంతో వినియోగదారులు భయబ్రాంతులకు గురై బయటకు వెళ్లిపోయారు. నిర్వాహకులపై భౌతికంగా దాడులు చేసిన వీడియో సిసి కెమెరాలో రికార్డు అయింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..