Yadadri: యాదాద్రి ఈవో ఓవ‌రాక్షన్.. కొండపైకి వాహనాల రాకపోకలపై ఆంక్షలు.. భక్తుల ఆందోళన!

ప్రముఖ దివ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహుడి ఆలయ ఈవో గీతారెడ్డి తీరు వివాదస్పదంగా మారుతోంది. కొండపైకి వాహనాల రాకపోకలను అనుమతించకపోవడంతో జర్నలిస్టులు, ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు.

Yadadri: యాదాద్రి ఈవో ఓవ‌రాక్షన్.. కొండపైకి వాహనాల రాకపోకలపై ఆంక్షలు.. భక్తుల ఆందోళన!
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 05, 2022 | 12:09 PM

Yadadri Temple: ప్రముఖ దివ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనారసింహుడి ఆలయ ఈవో గీతారెడ్డి తీరు వివాదస్పదంగా మారుతోంది. కొండపైకి వాహనాల రాకపోకలను అనుమతించకపోవడంతో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. మీడియా ప్రతినిధులపై కూడా ఆంక్షలు పెట్టారు ఈవో గీతారెడ్డి. దీంతో ఆంక్షలు ఎత్తేయాలంటూ ఘాట్ రోడ్డు వద్ద శాంతియుతంగా ఆందోళనకు దిగారు జర్నలిస్టులు. ఆందోళన చేస్తున్న జర్నలిస్ట్‌లను పోలీసుల చేత అరెస్ట్ చేయించారు ఈవో గీతారెడ్డి. అరెస్టులకు నిరసనగా యాదగిరిగుట్ట పోలీసుస్టేషన్‌ ఎదుట జర్నలిస్టుల బైఠాయించారు. జర్నలిస్టులకు మద్దతుగా ధర్నాలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం సహా అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. జర్నలిస్టు నిరసనకు సంఘీభావం తెలిపారు.

ఇటు ఇవాళ యాదగిరిగుట్ట బంద్‌ చేపట్టారు ఆటో డ్రైవర్లు. గుట్టపైకి అన్ని రకాల వాహనాలను అనుమతించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఆటోలు నిలిపివేయడంతో తాము ఇబ్బంది ఎదుర్కొంటున్నామని నిరసనకు దిగారు. గత 30 ఏళ్లుగా గుట్టపైకి ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని అంటున్నారు. ఎటువంటి సమాచారం లేకుండానే ఒక్కసారిగా గుట్టపైకి ఆటోలకు అనుమతి లేదని ఈవో ప్రకటించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈవో గీతారెడ్డి వైఖరి కి నిరసనగా ఈవో దిష్టిబొమ్మను స్థానికులు,ఆటో కార్మికులు దగ్ధం చేశారు.

ఈవో వైఖరిని నిరసిస్తూ మున్సిపల్‌ పాలకవర్గ మెంబర్స్‌ ఆందోళన చేపట్టారు. యాదాద్రి కొండపైకి వాహనాలపై వెళుతుండగా అనుమతి లేదంటూ అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఘాట్ వద్ద బైఠాయించి వారు ప్రజాప్రతినిధులను ఎలా అడ్డు కుంటారని వాగ్వాదానికి దిగారు. ఈవోకు సంబంధించిన బంధువుల వాహనాలను కొండపైకి ఎలా అనుమతిఇస్తారని నిరసన వ్యక్తం చేశారు.

Read Also… 

 Kishan Reddy: ప్రధాని మోదీ చొరవతోనే కట్టడాలకు యునెస్కో గుర్తింపు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
తిరుపతి తొక్కిసలాటపై స్పందించిన మోహన్ బాబు
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎందుకు భక్తులరద్దీ నెలకొంటుందో తెలుస
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..