Telangana: వ్యాక్సిన్ కోసం మహిళల సిగపట్లు.. జుట్టు పట్టి మరీ… మాములు రచ్చ కాదుగా..

దేశంలో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి విచిత్ర పరిస్థితులు నెలకున్నాయి. కొన్ని చోట్ల 'వ్యాక్సిన్ మాకొద్దు' అంటూ జనాలు పారిపోతున్నారు. మరికొన్ని చోట్ల...

Telangana: వ్యాక్సిన్ కోసం మహిళల సిగపట్లు.. జుట్టు పట్టి మరీ... మాములు రచ్చ కాదుగా..
Fight For Vaccine
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 24, 2021 | 7:20 PM

దేశంలో కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి విచిత్ర పరిస్థితులు నెలకున్నాయి. కొన్ని చోట్ల ‘వ్యాక్సిన్ మాకొద్దు’ అంటూ జనాలు పారిపోతున్నారు. మరికొన్ని చోట్ల ‘మాకు వ్యాక్సిన్ వెయ్యండి మొర్రో’ అంటూ ఎగబడుతున్నారు.  తాజాగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మినీ కురక్షేత్రాన్ని తలపించింది. ప్రజలు వ్యాక్సిన్‌ కోసం బారులు తీరారు.. సుమారు 150 మంది వివిధ గ్రామాల నుంచి మొదటి, రెండవ డోస్‌ కోసం ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది క్రమ పద్ధతిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఆ తరువాత వారికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంటుంది. కానీ అలాంటి పద్దతులు ఏవీ పాటించకపోవడంతో  మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య అధికారులు ప్రజలకు అవగాహన కల్పించకుండా వ్యాక్సిన్ వేస్తాం రండి అని చెప్పడంతో… పెద్ద మొత్తంలో ప్రజలు ఆస్పత్రికి తరలివచ్చారు. ఈ క్రమంలో స్పల్ప  తొక్కిసలాట కూడా జరిగింది.  కొంతమంది మహిళలు ఒకరినోకరు తోసుకున్నారు. పలువురు కింద పడటంతో గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని ప్రజలను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్‌ కొరత, సమన్వయ లోపం వల్లే ఇలాంటి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి సరిపడ వ్యాక్సిన్ డోసులు అందుబాటులో తేవడంతో పాటు, సమాచారం ఇచ్చే విషయంలో చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read:బాంబ్ పేల్చిన ఆర్ కృష్ణయ్య.. హుజూరాబాద్ బరిలో 1000 మంది..!

టీచర్ దంపతులపై నడిరోడ్డుపై దాడి.. లోతుగా విచారణ చేస్తే నిజం తెలిసి దిమ్మతిరిగిపోయింది.