AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman Returns: 11 ఏళ్ల క్రితం చనిపోయిందని అంత్యక్రియలు చేశారు.. కట్ చేస్తే బతికొచ్చింది.. అసలేం జరిగింది.. ఎలా బతికింది..

అంతా చనిపోయిందని చాలించుకున్నారు.. మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఆమె ఫోటోకు దండేశారు. కాలం వేగంగా గడిచిపోయింది.

Woman Returns: 11 ఏళ్ల క్రితం చనిపోయిందని అంత్యక్రియలు చేశారు.. కట్ చేస్తే బతికొచ్చింది.. అసలేం జరిగింది.. ఎలా బతికింది..
Woman Returns
Sanjay Kasula
|

Updated on: Aug 25, 2021 | 12:48 PM

Share

అంతా చనిపోయిందని చాలించుకున్నారు.. మృతదేహానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ఆమె ఫోటోకు దండేశారు. కాలం వేగంగా గడిచిపోయింది. చనిపోయిందని అనుకున్న ఆ మహిళ సరిగ్గా 11 ఏళ్ల తర్వాత తిరిగొచ్చింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో చోటు చేసుకుంది. అప్పట్లో ఆమె చనిపోయిందని భావించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే తాము అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహం ఆమెది కాదని తేలిపోయింది. ఎట్టకేలకు ఇన్నేళ్ల తర్వాత ఆ మహిళ తిరిగి కుటుంబ సభ్యులు సంబర పడిపోతున్నారు.

అసలు కథలోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో నర్సయ్య,లక్ష్మి అనే దంపతులుకు ముగ్గురు కుమార్తెలు. భర్త నర్సయ్య బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లాడు. లక్ష్మి గ్రామంలోనే కూలీ పనులకు కుటుంబాన్ని పోషిస్తోంది. ఇదే క్రమంలో 11 ఏళ్ల క్రితం ముగ్గురు కుమార్తెల్లో ఒకరైన లక్ష్మి తప్పిపోయింది. చనిపోయిందని అంతా భావిస్తు్న్నారు. ఆమె అదృశ్యమైన రెండేళ్లకు రెండేళ్ల తర్వాత నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌ అటవీ ప్రాంతంలో ఓ మహిళ శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. దుస్తులను చూసి లక్ష్మివేనని భావించి, కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

కానీ ఇన్నేళ్ల తర్వాత వారికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. తామ కూతురు బతికే ఉందని తెలిసింది. ఇన్నేళ్ల తర్వాత ఆమె తమిళనాడులోని పెరంబలూర్ ప్రాంతానికి చేరింది. అక్కడి ఓ స్వచ్చంద సంస్థ చేరదీసింది. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వారు ఆమెకు చికిత్స అందించారు.

ఇటీవల ఆమె కోలుకుని సాధారణ స్థితికి రావడంతో ఆ సంస్థ ప్రతినిధులు వివరాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి వెళ్లి లక్ష్మిని సోమవారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. చనిపోయిందనుకున్న ఆమె సోమవారం తిరిగి ఇంటికి చేరడంతో భర్త, కుమార్తెలు, ఇతర బంధువులు సంతోషం వ్యక్తం చేశారు. తమ ఇంటికి చేర్చిన స్వచ్చంద సంస్థకు వారు వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి: దిల్ మాంగే మోర్.. రిస్క్ ఎలాంటిదైనా ఇవి ఉండాల్సిందే.. కేబుల్ నుంచి భారతీయుల తరలింపులో వీటిదే కీ రోల్..

Viral Video: ఇవేంటిరా ఇంత శ్రద్ధగా దాడి చేశాయి..అతడు సినిమా డైలాగ్‌ను గుర్తు చేసిన మొసలి.. ఇది చూసిన నెటిజన్లు షాక్..

వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
వారికి సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 23 వరకు 50 శాతం డిస్కౌంట్..
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
ఇమ్యూనిటీ, జీర్ణక్రియ ఇబ్బందులకు ఈ 5 ఫుడ్స్‌తో చెక్ పెట్టేయచ్చు
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
SIPలో ఏడాదిగా రాబడి లేదా.. అయితే ఇలా చేయండి!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు శుభవార్త.. అకౌంట్లోకి డబ్బులు వచ్చాయ్.
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
టికెట్ రేట్ల పెంపుపై 90 రోజుల ముందే డెసిషన్..
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
పెంపుడు కుక్కకు 'నిలువెత్తు బంగారం'తో తులాభారం.. ఎందుకో తెలిస్తే
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ రైతులు కాలర్ ఎగరేస్తున్నారు.. ఏకంగా టన్ను రూ. 2 లక్షలు..
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
ఆ హీరో నమ్మకమే నా కెరీర్ అంటున్న అనిల్ రావిపూడి
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
కొంటె చూపులతో కట్టిపడేస్తు్న్న ముద్దుగుమ్మ.. అనికా స్టన్నింగ్..
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?
టీమిండియాకు గుడ్ న్యూస్.. రీఎంట్రీకి సిద్ధమైన తెలుగబ్బాయ్..?