ఏంటమ్మా ఇలా చేశావ్.. మూడేళ్ల కూతుర్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి.. ఎందుకంటే!
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న ఒక మహిళ తన మూడేళ్ల కూతురిని హత్య చేసి.. ఆ తర్వాత ఆమెకూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఒక మహిళ తన మూడేళ్ల కూతురిని హత్య చేసి.. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలుకోల్పోయిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యశోదా అనే మహిళ పట్టణంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం సమీపంలో తన మూడేళ్ల కూతురితో కలిసి నివాసం ఉంటుంది. అయితే నెల రోజుల క్రితం యశోద తన ఇంటి ముందు కొన్ని పల్లీలను ఆరబోసింది. అయితే ఆమె ఇంట్లోకి వెళ్లిన క్రమంలో ఒక కుక్కవచ్చి ఆ పల్లీలను తినడం స్టార్ట్ చేసింది. అదిగనించిన యశోద ఆ కుక్కను తరిమి కొట్టి ఆ పల్లీలను కడిగి మళ్లీ వాడుకుంది.
అయితే కుక్క తిన్న పల్లీలను తినడం ద్వారా ఆమెకు రేబిస్ వ్యాధి సోకి ఆమె గత కొన్ని రోజులు మతిస్థిమితి కోల్పోయిన ప్రవర్తిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ పరిస్థితుల్లోనే ఆమె సోమవారం ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




