మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన సమీప బంధువులు.. ఎందుకో తెలుసా..?
నిజామాబాద్ జిల్లాలో జరిగిన అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మోపాల్ మండలం సింగంపల్లిలో ఒక బర్రె రెండు కుటుంబాల మధ్యన ఘర్షణకు కారణం అయింది. అంతేకాదు మహిళను చెట్టుకు కట్టేసి చితక బాదేవరకు తీసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నిజామాబాద్ జిల్లాలో జరిగిన అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మోపాల్ మండలం సింగంపల్లిలో ఒక బర్రె రెండు కుటుంబాల మధ్యన ఘర్షణకు కారణం అయింది. అంతేకాదు మహిళను చెట్టుకు కట్టేసి చితక బాదేవరకు తీసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే సింగంపల్లి గ్రామానికి చెందిన పల్లికొండ సవిత, మమతలు దగ్గరి బంధువులు.. ఇంటి పక్క ఇండ్లు.. పులికొండ సవిత ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయాగా పనిచేస్తుంది. గత మూడు రోజులుగా పని ముగించుకుని ఇంటికి వచ్చే సరికి మమత వాళ్ళకు చెందిన బర్రె సవిత ఇంటి ఎదుట దుర్గంధంగా మారుస్తుంది. పేడ, మాలమూత్ర విసర్జననలతో విసిగిపోయిన పల్లికొండ సవిత.. ఆ పశువు యజమాని అయిన మమత కుటుంబ సభ్యులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని బర్రెను గదిలో బంధించింది.
దీంతో కోపోద్రిక్తులైన మమత కుటుంబ సభ్యులు తమ పశువుకు మంత్రాలు చేసిందని ఆరోపిస్తూ సవితను హనుమాన్ ఆలయం వద్ద చెట్టుకు కట్టేసి చితకబాదారు. గ్రామస్తుల సమక్షంలో మహిళపై దాడి చేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు. మొత్తం మీద బర్రె రెండు కుటుంబాల్లో చిచ్చు రేపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇఖ్కడ క్లిక్ చేయండి..
