Peddapalli : బిల్లు కట్టలేదని పవర్ కనెక్షన్ కట్ చేయబోయిన సిబ్బంది.. ఇంతలో ఊహించని ఝలక్ ఇచ్చిన మహిళ.. వీడియో వైరల్..

Peddapalli : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. సకాలంలో కరెంట్‌ బిల్లు కట్టలేదని పవర్‌ కట్‌ చేయడానికొచ్చిన సిబ్బందిని అడ్డుకుంది ఆ మహిళ. బిల్లు చెల్లిస్తానని..

Peddapalli : బిల్లు కట్టలేదని పవర్ కనెక్షన్ కట్ చేయబోయిన సిబ్బంది.. ఇంతలో ఊహించని ఝలక్ ఇచ్చిన మహిళ.. వీడియో వైరల్..
Power
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 26, 2021 | 9:52 AM

Peddapalli : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. సకాలంలో కరెంట్‌ బిల్లు కట్టలేదని పవర్‌ కట్‌ చేయడానికొచ్చిన సిబ్బందిని అడ్డుకుంది ఆ మహిళ. బిల్లు చెల్లిస్తానని.. కరెంట్‌ కట్‌ చేయొద్దని బ్రతిమలాడింది. కానీ వారు ఆమె విజ్ఞప్తిని లెక్క చేయలేదు. కరెంట్ పోల్ ఎక్కి.. ఆమె ఇంటికి విద్యుత్ కట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే, డబ్బులు చెల్లిస్తానంటూ ఆ పోల్ ఎక్కబోయే వ్యక్తి కాళ్లు కూడా పట్టుకుంది. వారు ఆమె మాటలను పట్టించుకోలేదు. పోల్ ఎక్కి కనెక్షన్ కట్ చేయబోయారు. కానీ, ఆ మహిళ ఇంతలో ఊహించని ఝలక్ ఇచ్చింది. చేతిలో రాయి పట్టుకుని పోల్ దిగుతావా? దిగవా? అంటూ బెదిరించింది. కొద్దిసేపు హంగామా చేసింది. చివరకు ఆమె కాళ్లా వేళ్లా పడుతుండటంతో.. కరెంట్‌ కట్‌ చేసేందుకు స్తంభం ఎక్కిన సిబ్బంది కిందకు దిగి వచ్చారు. అయితే, మహిళ హంగామాకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విద్యుత్ అధికారులు ఇంత కర్కశంగా ఎలా ఉంటారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also read:

RTOలో ఫ్యాన్సీ నంబర్లు వేలం.. జూనియర్‌ ఎన్టీఆర్‌ దక్కించుకున్న నెంబర్‌ ఇదీ..? వీడియో

Tirumala Dharshan: వెంకన్న భక్తులతో సందడిగా మారిన తిరుపతి.. సర్వ దర్శనం టికెట్స్‌ దొరక్క..

Deva Katta: ఇండస్ట్రీకి నాపై నమ్మకం పోయింది.. డైరెక్టర్ దేవా కట్టా షాకింగ్ కామెంట్స్..