Deva Katta: ఇండస్ట్రీకి నాపై నమ్మకం పోయింది.. డైరెక్టర్ దేవా కట్టా షాకింగ్ కామెంట్స్..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రిపబ్లిక్. ఇందులో సాయికి

Deva Katta: ఇండస్ట్రీకి నాపై నమ్మకం పోయింది.. డైరెక్టర్ దేవా కట్టా షాకింగ్ కామెంట్స్..
Deva Katta


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రిపబ్లిక్. ఇందులో సాయికి జోడీగా ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‏గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను నిన్న సాయంత్రం గ్రాండ్‏గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాగా.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని, ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గోన్నారు. ఈ సందర్భంగా.. రిపబ్లిక్ మూవీ డైరెక్టర్ దేవా కట్టా మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

దేవా కట్టా మాట్లాడుతూ.. ముందుగా నేను పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. సర్.. మీరు తేజ్ కోసం.. మా కోసం ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. తేజ్ పై అభిమానంతో ఇక్కడికి వచ్చిన వారికి ఆయనతో సినిమాలు చేసి ఆ సాన్నిహిత్యంతో ఇక్కడికి వచ్చిన దర్శకులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఇక్కడి వరకూ రావడానికి తేజ్ కారణం. ఒకసారి జిమ్‏లో తేజ్ కలిసినప్పుడు నేను కేవలం ఒక ఐడియా చెప్పాను. అప్పటికి నా దగ్గర కథ లేదు. నాలోని ఎమోషన్‎‏కి ఆయన వెంటనే కనెక్ట్ అయ్యాడు. ఆ ఐడియాను మరొకరికి చెప్పే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. సర్ ఈ కథ నాతోనే చేస్తానని ప్రామిస్ చేయండి అన్నాడు.. ప్రస్థానం తర్వాత నేను చేసిన తప్పుల వలన ఇండస్ట్రీకి నాపై నమ్మకం పోయింది. అలాంటి సమయంలో తేజ్ నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం వలన నేను ఆయనకు మాట ఇచ్చాను. అప్పటి నుంచి ఈ సినిమాకు ఆయన సైనికుడిలా కాపాడాడు. అలాంటి నా బ్రదర్ తేజ్..త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఈ సినిమా కథ చెప్పిన తర్వాత నిర్మాతలు నాపై నమ్మకంతో వదిలేశారు. నేను ఫస్ట్ కాపీ చూపించేవరకూ కనీసం వాళ్లు ఎడిట్ రూంలోకి కూడా రాలేదు. నాకు అంతటి స్వేచ్చను ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ అయితే అందరూ కారకులు .. ఒకవేళ ఫెయిల్ అయితే నేను ఒక్కడిని మాత్రమే కారకుడినని చెబుతున్నాను. ఎందుకంటే పరిపూర్ణంగా నా విజన్ తో నన్ను చేయనిచ్చారు అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ఈ సినిమాకు మణిశర్మగారు బ్యూటిఫుల్ ట్యూన్స్… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఎడిటర్ ప్రవీణ్ పనితనం కూడా నాకు నచ్చింది. నా డీఓపీ.. ఆర్టు డైరెక్టర్.. అందరూ కూడా అంకితభావంతో పనిచేశారు. నా ఉద్దేశం ప్రకారం డైలాగ్స్ అంటే మాటల గారడీ కాదు. ప్రతి మాట ఒక ఆలోచన రేకెత్తించాలి. ఆ ఉద్దేశ్యంతోనే డైలాగ్స్ రాశాను. ఇది థియేటర్లలో వదిలిపోయే సినిమా కాదు. మీ గుండెల్లో పెట్టుకుని మోసుకుపోయే సినిమా అవుతుందని నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చారు దేవా కట్టా. ఈ సినిమాను భగవాన్, పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు.

Also Read: Rana Daggubati: సరికొత్త అవతారం ఎత్తనున్న రానా.. విరాట పర్వం కోసం కొత్త ప్రయోగం..

Adire Abhi: హీరోగా మారిన జబర్ధస్త్ కమెడియన్.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‏లో అదిరే అభి సినిమా..

Click on your DTH Provider to Add TV9 Telugu