AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati: సరికొత్త అవతారం ఎత్తనున్న రానా.. విరాట పర్వం కోసం కొత్త ప్రయోగం..

ప్రస్తుతం టాలీవుడ్ చిత్రపరిశ్రమలో టాలెంటెడ్ హీరోలలో రానా ఒకరు. కేవలం హీరోగానే కాదు.. వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ...

Rana Daggubati: సరికొత్త అవతారం ఎత్తనున్న రానా.. విరాట పర్వం కోసం కొత్త ప్రయోగం..
Virataparvam
Rajitha Chanti
|

Updated on: Sep 26, 2021 | 9:08 AM

Share

ప్రస్తుతం టాలీవుడ్ చిత్రపరిశ్రమలో టాలెంటెడ్ హీరోలలో రానా ఒకరు. కేవలం హీరోగానే కాదు.. వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ… పాన్ ఇండియా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతి నాయకుడి పాత్రలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. అంతేకాకుండా.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మిస్తూ.. నిర్మాతగానూ రాణిస్తున్నారు. అయితే ఇవే కాకుండా.. రానా ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తాడు. ఎంటీ హీరోగా.. విలన్‏గా కాకుండా.. మరో కొత్త అవతారం ఏంటీ అనుకుంటున్నారా ? ఈసారి సింగర్‏గా మారారు.

ప్రస్తుతం రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విరాట పర్వం. ఇందులో రానాకు జోడిగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రానా ఓ పాట పాడనున్నాడట. అది కూడా ఈ సినిమాలోనే స్పెషల్ సాంగ్ అని టాక్ వినిపిస్తోంది. వచ్చే వారం ఈ పాటను రికార్డ్ చేయబోతున్నారట. రివల్యూషన్‌​ ఈజ్‌ ఏన్‌ యాక్ట్‌ ఆఫ్‌ లవ్‌ అనే ట్యాగ్‌లైన్‌ తో రూపొందుతున్న ఈ చిత్రంలో నక్సలైట్‌ రవన్న పాత్రలో కనిపించనున్నారు రానా. అయితే ఇందులో ఓ విప్లవ గీతానికి రానా వాయిస్ బాగుంటుందని.. తను ఆ పాటను పాడాలని డైరెక్టర్ వేణు ఊడుగుల కోరారట. ఇందుకు రానా కూడా ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read: Adire Abhi: హీరోగా మారిన జబర్ధస్త్ కమెడియన్.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‏లో అదిరే అభి సినిమా..

Dil Raju: తను ఎన్నో కష్టాలు చూశాడు.. సక్సెస్‏లు, ఫెయిల్యూర్స్ చూశాడు.. తేజ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన దిల్ రాజు..

Pawan Kalyan – Republic Movie: మోహన్ బాబుపై సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్.. మీకు కూడా ఆ పరిస్థితి రావొచ్చంటూ..