Adire Abhi: హీరోగా మారిన జబర్ధస్త్ కమెడియన్.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అదిరే అభి సినిమా..
నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారి సక్సెస్ అందుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఇక జబర్ధస్త్ కమెడియన్స్ కూడా హీరోగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు
నటుడిగా ఎంట్రీ ఇచ్చి.. హీరోగా మారి సక్సెస్ అందుకున్నవారు చాలా మందే ఉన్నారు. ఇక జబర్ధస్త్ కమెడియన్స్ కూడా హీరోగా తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే సుడిగాలి సుధీర్ హీరోగా సాఫ్ట్వేర్ మూవీలో నటించి ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో జబర్ధస్త్ కమెడియన్ హీరోగా అవతారం ఎత్తాడు. గతంలో నటుడు అదిరే అభి.. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదిరే అభి హీరోగా మారాడు.. ఆయన ప్రధాన పాత్రలలో రూపొందుతున్న సినిమా వైట్ పేపర్. ఈ సినిమమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు. జి.ఎస్.కె. ప్రొడక్షన్స్ పతాకంపై గ్రంథి శివ కుమార్ నిర్మిస్తున్నారు. నిన్న అదిరే అభి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ప్రముఖ గాయకుడు మనో, నటులు అనసూయ, ఇంద్రజ విడుదల చేసి, చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా అభి మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే సినిమా చేయాలనే ఆసక్తి కలిగింది. 9 గంటల 51 నిమిషాల్లోనే షూటింగ్ పూర్తి చేయాలన్న ఆయన డెడికేషన్ నచ్చింది. అనుకున్నట్టుగానే నిర్ణీత సమయంలో ఈ చిత్రాన్ని పూర్తి చేసాం. అలా విడుదలకి ముందే ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ సినిమా చోటు దక్కించుకుంది. ఈ అవార్డు రావటం, మనో, ఇంద్రజ, అనసూయ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. సస్పెన్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఇది. అభి నటించకపోతే ఈ సినిమా ఉండేది కాదు.. అవార్డూ వచ్చేది కాదేమో. సినిమాను ఒక్క రోజులో ఎలా తీయగలవు ? అని చాలా మంది ప్రశ్నించారు. అభి ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైందని అన్నారు డైరెక్టర్ శివ. ఈ సినిమాలో వాణి, తల్లాడ సాయి కృష్ణ, నేహా, నంద కిషోర్ కీలక పాత్రలలో నటించారు. అలాగే ఈ చిత్రానికి నవనీత్ చారి సంగీతం అందించారు.
Most Eligible Bachelor: బ్యాచిలర్ రాక ఆలస్యం కానుందా.? అఖిల్ చెప్పిన రోజున రావట్లేదా.?