Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dil Raju: తను ఎన్నో కష్టాలు చూశాడు.. సక్సెస్‏లు, ఫెయిల్యూర్స్ చూశాడు.. తేజ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన దిల్ రాజు..

మెగా హీరో సాయి ధరమ్ నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Dil Raju: తను ఎన్నో కష్టాలు చూశాడు.. సక్సెస్‏లు, ఫెయిల్యూర్స్ చూశాడు.. తేజ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన దిల్ రాజు..
Dil Raju
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 26, 2021 | 8:20 AM

మెగా హీరో సాయి ధరమ్ నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదల కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న హైదరాబాద్‏లో రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‏ను ఎంతో గ్రాండ్‏గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని, ప్రొడ్యూసర్ దిల్ రాజు సైతం అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంగా.. దిల్ రాజు హీరో సాయి ధరమ్ తేజ్, రిపబ్లిక్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

సాయి దరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలి. అతనికి ఇంత మంది అభిమానులు ప్రేమ, ఆశీర్వాదం, అనుబంధం ఉంది. కాబట్టే.. సాయి ఇంత త్వరగా కోలుకుంటున్నారు. ఈ వేడుకలో ఇక్కడ లేకపోయినా.. అభిమానుల రూపంలో సాయి ధరమ్ తేజ్ ఇక్కడే ఉన్నాడు. ఆయన త్వరగా కోలుకోవాలి. ఇక రిపబ్లిక్ దర్శకుడు దేవా కట్ట.. ఆయనెంతో ఫ్యాషన్ ఉన్న డైరెక్టర్. తాను అనుకున్నది వచ్చే వరకు తీసే డైరెక్టర్. ఆయన టేకింగ్ అద్భుతంగా ఉంటుంది. రిపబ్లిక్ స్టోరీ లైన్ ను నాకు తేజూ చెప్పాడు. నిర్మాతకు, టీం అందరికీ థ్యాంక్స్, తేజు ఎన్నో కష్టాలను చూశాడు. సక్సెస్ లు చూశాడు. ఫెయిల్యూర్స్ చూశాడు. ఇలాంటి ఓ ఘటన జరిగిన కూడా అక్టోబర్ 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇందుకు కారణం మెగా అభిమానులు. చిరంజీవి గారు, పవన్ గారు వెనకుండి ఈ సినిమాను నడిపిస్తూ.. ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. లాస్ట్ టైం కరోనా తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ఇండస్ట్రీకి ఊపిరినిచ్చాడు. ఇప్పుడు రిపబ్లిక్ సినిమాతో వస్తున్నాడు. ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే రిపబ్లిక్ సినిమాకు కూడా ఘన విజయం అందించాలి.

Also Read: Gopichand Malineni: ఆ ఇద్దరు మిక్స్ అయితే తేజ్.. సాయిపై ప్రశంసలు కురిపించిన ఆ డైరెక్టర్ గోపిచంద్ మలినేని…

Most Eligible Bachelor: బ్యాచిల‌ర్ రాక ఆల‌స్యం కానుందా.? అఖిల్ చెప్పిన రోజున రావ‌ట్లేదా.?