Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala Dharshan: వెంకన్న భక్తులతో సందడిగా మారిన తిరుపతి.. సర్వ దర్శనం టికెట్స్‌ దొరక్క..

స్వామివారి సర్వ దర్శనం టికెట్స్‌ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. తిరుమల కొండకు వెళ్లే మార్గం లేక రెండ్రోజులుగా తిరుపతిలోనే పడిగాపులు పడుతున్నారు.

Tirumala Dharshan: వెంకన్న భక్తులతో సందడిగా మారిన తిరుపతి.. సర్వ దర్శనం టికెట్స్‌ దొరక్క..
Tirumala Darshanam
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 26, 2021 | 9:44 AM

తిరుపతి..వెంకన్న భక్తులతో కిటకిటలాడుతోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు… ఆపద మొక్కుల వాడు., భక్తుల పాలిట కల్పతరువుగా… కోరిన కోర్కెలు తీర్చే ఆ శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. వెంకటేశ్వరుడు కొలువై ఉన్న ఏడుకొండలు ఎంతో పవిత్రమైనవి. అందుకే సప్తగిరులను శ్రీవారి సన్నిధిగానే భావిస్తారు. భక్త కౌసల్యుని దర్శనంతోనే కాదు అయన వెలసిన దివ్యధామమైన తిరుగిరుల్లో పాదాలు మోపినా మోక్షం సిద్ధిస్తుంది.

స్వామివారి సర్వ దర్శనం టికెట్స్‌ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. తిరుమల కొండకు వెళ్లే మార్గం లేక రెండ్రోజులుగా తిరుపతిలోనే పడిగాపులు పడుతున్నారు. నిన్నఆన్‌లైన్‌లో రిలీజ్‌ చేసిన అక్టోబర్‌ కోటా టికెట్స్‌ దొరక్కపోవడం.. మరోవైపు ఆఫ్‌లైన్‌లో దర్శనం టికెట్స్‌ అందుబాటులో లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు.

శ్రీవారిని దర్శించుకొని..మొక్కులు తీర్చుకుందామని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు టికెట్స్‌ దొరక్క నిరాశ చెందుతున్నారు. టీటీడీ వసతి గృహాలు, ఇంటర్‌ నెట్‌ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతున్నారు. వెంకన్నను దర్శించుకోకుండా ఎలా తిరిగి వెళ్తామని ఆవేదన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి:  AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..