AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల్లే హంతకురాలు.. వివాహేతరబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల కూతుర్ని కడతేర్చింది..

నిద్రపోయిన కూతురు ఎంతకూ లేవలేదని, ఎలాగైనా బతికించాలంటూ కళ్యాణి ఓ డ్రామా ఆడింది. అప్పటికే భార్యపై భర్త రమేష్ కుమార్‌కు అనుమానం వచ్చింది. కానీ, ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ, అతడికి వచ్చిన ఆ అనుమానమే నిజం కావడంతో పోలీసులు కళ్యాణిని, నవీన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

తల్లే హంతకురాలు.. వివాహేతరబంధానికి అడ్డుగా ఉందని నాలుగేళ్ల కూతుర్ని కడతేర్చింది..
Crime
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jul 12, 2023 | 11:09 AM

Share

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ తల్లి తన కన్న బిడ్డని హతమార్చింది. జులై రెండున జరిగిన తన్విత అనే నాలుగున్నర ఏళ్ల చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుషాయిగూడ మార్కెట్ వద్ద ఉండే నాయక్ వాడి రమేష్ కుమార్ ఆటో డ్రైవర్ అదే ప్రాంతానికి చెందిన కళ్యాణిని ప్రేమించి 2018లో వివాహం చేసుకున్నాడు. జనగామ జిల్లా నర్మెట్ట ఆమె సొంత గ్రామం. పెళ్లైన ఏడాదికే వీరికి చిన్నారి తన్విత జన్మించింది. కానీ, కళ్యాణి, రమేష్ దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే 2021 ఫిబ్రవరి నుంచి దంపతులిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. స్థానిక కూరగాయల మార్కెట్లో పని చేసుకుంటూ కూతురు తన్వితను చూసుకుంటుంది తల్లి కళ్యాణి.

అయితే దూరపు చుట్టమైన బండ్ల నవీన్ అనే యువకుడితో కళ్యాణికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అప్పుడే కళ్యాణికి దురాలోచన మొదలైంది. అడ్డుగా ఉన్న కూతురు తన్వితను అంతమొందించాలని ప్లాన్ వేసింది. జులై1న మధ్యాహ్నం స్కూల్ నుంచి భోజనం చేసేందుకు వచ్చిన చిన్నారిని మంచంపై పడుకోబెడుతున్నట్లుగా నటిస్తూ..చిన్నారి ముఖంపై దిండు ఒత్తిపెట్టి ఊపిరి ఆడకుండా హత్య చేసింది.

ఆ తర్వాత కూతురికి ఆరోగ్యం బాలేదని భర్తకు ఫోన్ చేసి చెప్పింది కళ్యాణి. ఇటు నిద్రపోయిన కూతురు ఎంతకూ లేవలేదని, ఎలాగైనా బతికించాలంటూ కళ్యాణి ఓ డ్రామా ఆడింది. అప్పటికే భార్యపై భర్త రమేష్ కుమార్‌కు అనుమానం వచ్చింది. కానీ, ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ, అతడికి వచ్చిన ఆ అనుమానమే నిజం కావడంతో పోలీసులు కళ్యాణిని, నవీన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
దసరా పండుగ ఆఫర్లు తెలిస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జుట్టు రాలిపోతుందా? ఇంట్లోనే అవిసె గింజలతో ఈ హెయిర్ మాస్క్ తయారీ
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
జేబు ఖాళీ కాదు.. బరువు పెరగరు.. సూపర్‌మార్కెట్‌కు వెళ్లేముందు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
సోషల్ మీడియా నాకు నచ్చలేదు..
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
కలలో దారి తప్పిపోవడం అశుభమా? జీవితంలోని అయోమయానికి సంకేతమా?
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..