AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Story on Kiran Dembla: సిక్స్ ప్యాక్ సూపర్-మామ్ కిరణ్ డెంబ్లా.. ఎవరో కాదు.. మన హైదరాబాదీనే

చిన్నప్పటి నుంచి క్లాసికల్ సింగర్ అయిన కిరణ్... దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చింది. మ్యూజిక్ పై తనకున్న ఇష్టంతో మ్యూజిక్ లవర్స్ ని ఉర్రూతలూగించడానికి డీ.జె. కె.డి. బెల్ గా అవతారమెత్తింది. తమన్నా చేతులమీదుగా గ్రాండ్ గా తన న్యూ కెరీర్ ని స్టార్ట్ చేసిన కిరణ్... తన మ్యూజిక్ తో పబ్ లలో పార్టీ లవర్స్ కి మత్తెక్కిస్తోంది. ఒక్క ఫిట్ నెస్ ట్రైనర్ గానే కాదు.

Story on Kiran Dembla: సిక్స్ ప్యాక్ సూపర్-మామ్ కిరణ్ డెంబ్లా.. ఎవరో కాదు..  మన హైదరాబాదీనే
Kiran Dembla
Peddaprolu Jyothi
| Edited By: Jyothi Gadda|

Updated on: Jul 12, 2023 | 8:48 AM

Share

సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఓ మహిళ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకోండి. కండలు తిరిగిన క్రేజీ ఫిజిక్ పబ్లిక్‌గా డేజేయింగ్ చేస్తే ఎలా ఉంటుందో హైదరాబాదీలకు పరిచయం చేసింది కిరణ్ డెంబ్లా. అధిక బరువు నుంచి సిక్స్ ప్యాక్ లేడి, సెలబ్రెటీ ట్రైనర్, డీజే.. ఇలా సెన్సేషన్ కు కేరాఫ్ గా నిలిచిన ఫిట్ నెస్ క్వీన్ కమ్ డీ.జె. కే.డి.బెల్ కిరణ్ డెంబ్లను చూసిన వారెవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ.. సిక్స్ ప్యాక్ తో వావ్ అనిపించుకుంటోంది. భారత్ లోనే సిక్స్ ప్యాక్ సాధించిన ఫస్ట్ ఉమెన్ గా గుర్తింపు తెచ్చుకుంది మన హైదరాబాద్ కు చెందిన కిరణ్ డెంబ్లా. ఐదేళ్ల క్రితం బాడీ బిల్డింగ్ పోటీల్లోను పాల్గొని.. బెస్ట్ ఫర్ఫార్మర్ గా ఆకట్టుకుంది. ఫిట్ నెస్ ట్రైనర్ గా వర్క్ చేస్తూనే, మోడల్స్ కి తానేం తక్కువ కాదంటూ… ఫ్యాషన్ షోలలోను తన కండలు చూపిస్తూ…పిల్లినడకతో అలరిస్తోంది.

సిటిలో సెటిల్ అయిన కిరణ్ డెంబ్లాకు ప్రస్తుతం 47ఏళ్ళు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు పుట్టాక.. 75 కిలోల అధిక బరువుతో బాధపడింది. దీంతో యోగా చేయడం ప్రారంభింది. కొంచం బరువు తగ్గాక.. జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ… 6 నెలల్లోనే సిక్స్ ప్యాక్ సాధించి వావ్ అనిపించింది. ఆ తర్వాత ఫిట్ నెస్ ట్రైనర్ గా కెరీర్ ప్రారంభించింది. అప్పట్నుంచి తాను వెనక్కి తిరిగి చూస్కోలేదు. టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రెటీలు సైతం ఆమె ట్రైనింగ్ కోసం క్యూ కట్టారు. కాజల్ అగర్వాల్, అనుష్క, రకూల్ ప్రీత్ సింగ్, తమన్నా, వెంకటేశ్, సూర్య… ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే.

ఇక, చిన్నప్పటి నుంచి క్లాసికల్ సింగర్ అయిన కిరణ్… దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలిచ్చింది. మ్యూజిక్ పై తనకున్న ఇష్టంతో మ్యూజిక్ లవర్స్ ని ఉర్రూతలూగించడానికి డీ.జె. కె.డి. బెల్ గా అవతారమెత్తింది. తమన్నా చేతులమీదుగా గ్రాండ్ గా తన న్యూ కెరీర్ ని స్టార్ట్ చేసిన కిరణ్… తన మ్యూజిక్ తో పబ్ లలో పార్టీ లవర్స్ కి మత్తెక్కిస్తోంది. ఒక్క ఫిట్ నెస్ ట్రైనర్ గానే కాదు. మంచి మోటివేటర్ కూడా. ఎన్నో షోలలో చిన్నారులకు పాఠాలు చెప్పింది. ఫిట్ నెస్ ట్రైనర్స్ కి సైతం స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంది. మోడల్స్ కి తానేం తక్కువ కాదంటూ.. ఫ్యాషన్ షో లలో తళుక్కున మెరుస్తూ వచ్చింది. మద్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కిరణ్‌ డెంబ్లా .. ఎందరో మహిళలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ న్యూస్ కోసం క్లిక్ చేయండి..