Hyderabad: పాత బస్తీలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్‌.. భయాందోళనలో స్థానికులు

పాతబస్తీలో గంజాయి బ్యాచ్‌ ఆగడాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. గంజాయి మత్తులో రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తున్నారు. అర్థరాత్రి స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల పాత బస్తీలో అక్బర్‌ అండ్‌ గ్యాంగ్‌ రెచ్చిపోయింది. ఇంటి ముందు స్నేహితుడితో మాట్లాడతున్న పర్వేజ్‌...

Hyderabad: పాత బస్తీలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్‌.. భయాందోళనలో స్థానికులు
Old City
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Narender Vaitla

Updated on: Jul 12, 2023 | 10:44 AM

పాతబస్తీలో గంజాయి బ్యాచ్‌ ఆగడాలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. గంజాయి మత్తులో రోడ్డుపై నానా హంగామా సృష్టిస్తున్నారు. అర్థరాత్రి స్థానికులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. ఇటీవల పాత బస్తీలో అక్బర్‌ అండ్‌ గ్యాంగ్‌ రెచ్చిపోయింది. ఇంటి ముందు స్నేహితుడితో మాట్లాడతున్న పర్వేజ్‌ అనే యువకుడితో అకారణంగా గొడవకు దిగింది. వెంట తెచ్చుకున్న కత్తితో పర్వేజ్‌పై దాడి చేసి పరైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పర్వేజ్ సోమవారం రాత్రి మృతిచెందాడు.

దీంతో పర్వేజ్‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే పాషాఖాద్రి.. రూ. 2లక్షలు తీసుకుని హత్యలకు పాల్పడే నేరస్తులు పోలీసులతో మిలాఖాత్‌ అవుతున్నారని సంచనల వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రి చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. గంజాయి ముఠాను అరెస్ట్‌ చేసే దమ్ము, ధైర్యం పోలీసులకు లేదని కామెంట్‌ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. పోలీసులే గంజాయి గ్యాంగ్‌లను ప్రోత్సహిస్తున్నారని, డబ్బులు తీసుకుని గంజాయి బ్యాచ్‌ను వదిలేస్తున్నారని సంచనల ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే పాషాఖాద్రి.

పాతబస్తీలో రౌడీ షీటర్లు.. రూ.2లక్షలు తీసుకుని హత్యలకు పాల్పడుతున్నారన్నారు. పోలీసులతో నేరస్తులు మిలాఖాత్‌ అవుతున్నారని.. హత్య చేసి లొంగిపోయి, 15-20రోజుల్లో బెయిల్‌ తెచ్చుకుంటున్నారన్నారు. అంతేకాదు.. గంజాయి బ్యాచ్‌లపై ఫిర్యాదులు చేస్తే పోలీసులు వచ్చి అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గంజాయిగాళ్లపై పీడీయాక్ట్‌ పెట్టాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే పాషాఖాద్రి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!