MLC Kavitha: తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తారా.? రాహుల్‌ గాంధీని ప్రశ్నించిన కవిత

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అంశంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అమెరికాలో జరిగిన తానా సభలకు హాజరైన సందర్భంగా రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు...

MLC Kavitha: తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తారా.? రాహుల్‌ గాంధీని ప్రశ్నించిన కవిత
MLC Kavitha
Follow us
Prabhakar M

| Edited By: Narender Vaitla

Updated on: Jul 12, 2023 | 12:22 PM

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అంశంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అమెరికాలో జరిగిన తానా సభలకు హాజరైన సందర్భంగా రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేతలు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత్‌ రాహుల్‌ గాంధీపై విరుచుకుపడ్డారు. రైతులకు 24 గంటలు ఉచితి విద్యుత్ ఇవ్వడం వల్ల రాజకీయా పార్టీలకు నష్టం ఏంటంటూ ఆమె ప్రశ్నించారు. వ్యవసాయానికి 3 గంటల ఉచిత విద్యుత్ చాలని చెప్పడం దిగ్భ్రాంతిని కలిగించిందని కవిత అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేయాలనుకుంటున్నారా.? అంటూ రాహుల్‌ గాంధీని ఈ సందర్భంగా కవిత ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎట్టి పరిస్థితుల్లో రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని, రైతులకు అండగా ఉంటుందని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే హైదరాబాద్‌ విద్యుత్ సౌధ ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎమ్యెల్యే కవిత పాల్గొన్నారు. రేవంత్‌ రెడ్డి క్షమాపణాలు చెప్పాలంటూ కవిత డిమాండ్ చేశారు. రైతులకు మూడు గంటల విద్యుత్ చాలన్న రేవంత్‌ను తరిమి కొట్టాలని కవిత ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ధర్నాలో ఎమ్మెల్సీ కవితతో పాటు దానం నాగేందర్‌ పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!