Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఫోన్ సిగ్నల్స్ లేక..108కు కలవక.. ఆటోలోనే ప్రసవించిన గర్భిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం పెద్ద వెంకటాపురానికి చెందిన గోగ్గిల సౌజన్య నిండు నెలల గర్భిణి. ఉన్నట్టుండి పురిటి నొప్పులు ఎక్కువ రావడంతో 108కి ఫోన్ చేసిందుకు ప్రయత్నం చేశారు. మారు మూల ఏజెన్సీ ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్ ఇప్పటికీ రాని పరిస్థితి ఉంది. సిగ్నల్స్ కోసం ప్రయత్నం చేసినా సిగ్నల్స్ లేక..108 అంబులెన్స్‌కు ఫోన్ కలవలేదు. దీనికి తోడు.. ఆశా వర్కర్లు సమ్మెలో ఉండటంతో గర్భిణీ నీ సరైన సమయంలో ఆసుపత్రికి తరలించలేక పోయారు. ఈ లోపు నొప్పుల తీవ్రత..

Telangana: ఫోన్ సిగ్నల్స్ లేక..108కు కలవక.. ఆటోలోనే ప్రసవించిన గర్భిణీ
Woman Gave Birth In Auto
Follow us
N Narayana Rao

| Edited By: Srilakshmi C

Updated on: Oct 03, 2023 | 3:44 PM

కొత్తగూడెం, అక్టోబర్‌ 3: మారుమూల ఏజెన్సీలో రహదారి సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలు లేక ఏజెన్సీ వాసులు ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికీ అభివృద్ధి కి ఆమడ దూరంలో ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయి.. అత్యవసర వైద్య సేవలకు, గర్భిణీ లను ఆసుపత్రులకు తరలించాలంటే..ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందే.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం పెద్ద వెంకటాపురానికి చెందిన గోగ్గిల సౌజన్య నిండు నెలల గర్భిణి. ఉన్నట్టుండి పురిటి నొప్పులు ఎక్కువ రావడంతో 108కి ఫోన్ చేసిందుకు ప్రయత్నం చేశారు. మారు మూల ఏజెన్సీ ప్రాంతంలో ఫోన్ సిగ్నల్స్ ఇప్పటికీ రాని పరిస్థితి ఉంది. సిగ్నల్స్ కోసం ప్రయత్నం చేసినా సిగ్నల్స్ లేక..108 అంబులెన్స్‌కు ఫోన్ కలవలేదు. దీనికి తోడు.. ఆశా వర్కర్లు సమ్మెలో ఉండటంతో గర్భిణీ నీ సరైన సమయంలో ఆసుపత్రికి తరలించలేక పోయారు. ఈ లోపు నొప్పుల తీవ్రత ఎక్కువ కావడంతో ఆటోలో తీసుకొని వెళుతుండగా మార్గ మధ్యలో ఆటోలోనే ప్రసవం కావడంతో సౌజన్య మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. తర్వాత ఆసుపత్రికి తీసుకు వెళ్లగా డాక్టర్ సలహాతో ప్రధమ చికిత్స చేసి తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని నిర్ధారించారు.

అప్పటివరకు భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా మండల కేంద్రాలలో ఆశా వర్కర్లు నిరువదిక సమ్మె చేస్తున్నారు. ఆశ వర్కర్లు విధులలో లేని లోటు ఈ సంఘటనను బట్టి మనం చెప్పుకోవచ్చు ఇలా అనేక చోట్లలో ఆశ వర్కర్లు లేకపోవడంతో గ్రామీణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సౌజన్యకు కూడా హాస్పిటల్ కి ఎప్పుడు వెళ్లాలో తెలియక నొప్పులు వచ్చేంతవరకు ఇంటి వద్ద ఉండడం..108 కి ఫోన్ సిగ్నల్స్ లేక కలవక పోవడంతో గర్భిణీ అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడంతో ఆ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉండడంతో వారిని ఇంటికి పంపించారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.