PM Modi in Nizamabad Highlights: నిజామాబాద్‌ సభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

Subhash Goud

|

Updated on: Oct 03, 2023 | 7:22 PM

PM Modi in Telangana Updates Highlights: కలెక్టరేట్‌ ఆవరణలోని హెలిప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గంలో గిరిరాజ్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. వేర్వేరుగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలు, బహిరంగ సభల వేదికల వద్దకు వెళ్తారు. మధ్యాహ్నం 3 నుంచి 3:40 గంటల వరకు ఓ సభా వేదిక పైనుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవాలుంటాయి. అనంతరం 3:45కి సమీపంలోని బహిరంగ సభా వేదికపై నుంచి ప్రసంగిస్తారు..

PM Modi in Nizamabad Highlights: నిజామాబాద్‌ సభలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
Modi Speech

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణలో మరోసారి పర్యటించారు. నిజామాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ.. రూ. 8 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా ప్రధాని బీదర్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి మధ్యాహ్నం 2:55 గంటలకు నిజామాబాద్‌ చేరుకుని కలెక్టరేట్‌ ఆవరణలోని హెలిప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గంలో గిరిరాజ్‌ కళాశాల మైదానానికి చేరుకున్నారు. వేర్వేరుగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలు, బహిరంగ సభల వేదికల వద్దకు వెళ్లారు. మోడీ సభ నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కాలేజీ మైదానంలో నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మోడీ రాజకీయ ప్రసంగం చేశారు. ప్రధాని మోడీ ప్రసంగంలో తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Oct 2023 05:48 PM (IST)

    కేసీఆర్‌ ఓ ప్రతిపాదనతో నా వద్దకు వచ్చారు- మోడీ

    జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఓ ప్రతిపాదనతో నా వద్దకు వచ్చారని, తాను ఇక బాధ్యతలు కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తానని అన్నారు. ఎన్డీయేలో చేరేందుకు ముందుకు వచ్చారని అన్నారు. అందుకు తాను ఒప్పుకోలేదన్నారు.

  • 03 Oct 2023 05:36 PM (IST)

    ఎవరు అధికారంలో ఉండాలన్నది ప్రజలే నిర్ణయిస్తారు

    తెలంగాణలో ఎవరు అధికారంలో ఉండాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని మోడీ అన్నారు. ఇచ్చిన మాటను కట్టుబడే అలవాటు బీజేపీ ఉంది. ఇది రాజరీకం కాదు.. ప్రజాస్వామ్యం అని అన్నారు.

  • 03 Oct 2023 05:33 PM (IST)

    కాంగ్రెస్‌ వాగ్ధానాలు నమ్మకండి

    తెలంగాణ ప్రజలారా నాపై ఐదేళ్లపాటు నమ్మకం ఉంచండి. తెలంగాణలో జరుగుతున్న అవినీతి గురించిఒ మీ పాదాల ముందుంచుతాను అని మోడీ అన్నారు. అలాగే కాంగ్రెస్‌ వాళ్లు చెప్పే వాగ్ధానాలను నమ్మకండి అని అన్నారు.

  • 03 Oct 2023 05:23 PM (IST)

    కేసీఆర్‌ ప్రతిపాదన నేను ఒప్పుకోలేదు- మోడీ

    జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వచ్చి నన్ను కలిశారని, శాలువాల, పూలమాలలతో సత్కరించి ఎన్డీఏలో చేర్చుకోవాలని అభ్యర్థించారని అన్నారు. తాను అందుకు ఒప్పుకోలేదని మోడీ అన్నారు. కేసీఆర్‌ ప్రతిపాదనకు నేను ఒప్పుకోలేదన్నారు.

  • 03 Oct 2023 05:13 PM (IST)

    తెలంగాణలో కేసీఆర్‌ పాలనలో అవినీతి పెరిగింది- మోడీ

    తెలంగాణలో కుటుంబ పాలనపై మోడి మండిపడ్డారు. కేసీఆర్‌, ఆయన కుమాడు, కూతురు, అల్లుడు తెలంగాణలో హవా కొనసాగిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ పాలనలో అంతా అవినీతి పెరిగిపోయిందన్నారు.

  • 03 Oct 2023 05:07 PM (IST)

    మోడీ ప్రసంగం ప్రారంభం

    నిజామాబాద్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత ప్రధాన నరేంద్ర మోడీ బహిరంగ సభలో మాట్లాడారు. తెలుగులో భారత్‌ మాతాకీ జై అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు మోడీ.

  • 03 Oct 2023 04:32 PM (IST)

    తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

    తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. త్వరలో దేశంలో అన్ని రైల్వేలైన్‌లను విద్యుదీకరణ చేస్తామని అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌, జన ఔషద్‌ కేంద్రాలు ప్రారంభించామన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ను అత్యాధునికరంగా తీర్చిదిద్దుతామన్నారు.

  • 03 Oct 2023 04:27 PM (IST)

    మా ప్రభుత్వం శంకుస్థాపనలే కాదు.. వాటిని పూర్తి చేసుంది- మోడీ

    మా ప్రభుత్వం శంకుస్థాపనలో కాదు.. వాటిని పూర్తి చేసుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నిజామాబాద్‌లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మోడీ.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో ఎన్టీపీసీ రెండో యూనిత్‌ను ప్రారంభిస్తామని అన్నారు.

  • 03 Oct 2023 04:22 PM (IST)

    సిద్దిపేట- సికింద్రాబాద్‌ రైల్‌ను ప్రారంభించిన మోడీ

    సిద్దిపేట – మనోహరాబాద్‌ రైల్వే లైన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దిపేట- సికింద్రాబాద్‌ రైల్‌ సర్వీస్‌ను ప్రారంభించారు.

  • 03 Oct 2023 04:02 PM (IST)

    తెలంగాణ సూపర్‌ థర్మల్‌ ప్రాజెక్టు జాతికి అంకితం

    • రూ.8వేల కోట్ల విలువైన పనులకు శ్రీకారం
    • తెలంగాణ సూపర్‌ థర్మల్‌ ప్రాజెక్టు జాతికి అంకితం
    • పలు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
    • మనోహరాబాద్‌-సిద్దిపేట కొత్త రైల్వేలైన్‌
    • సిద్దిపేట-సికింద్రాబాద్‌ మధ్య తొలి రైలు ప్రారంభం
    • రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్న మోదీ
    •  క్రిటికల్ కేర్ బ్లాక్స్ ప్రారంభించనున్న మోదీ
  • 03 Oct 2023 03:54 PM (IST)

    నిజామాబాద్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

    ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌కు చేరుకున్నారు. మోడీ గవర్నర్‌ తమిళిసై, కిషన్‌రెడ్డిలు ఘన స్వాగతం పలికారు.న

  • 03 Oct 2023 03:32 PM (IST)

    కాసేపట్లో సికింద్రాబాద్‌-సిద్ధిపేట రైలు ప్రారంభం

    ప్రధాని నరేంద్ర మోడీ కాసేపట్లో వర్చువల్‌గా సికింద్రాబాద్‌-సిద్ధిపేట రైలును ప్రారంభించనున్నారు.

  • 03 Oct 2023 03:07 PM (IST)

    కాసేపట్లో నిజామాబాద్‌కు మోడీ

    కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌కు రానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లను మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మూడు రోజుల కిందట పాలమూరులో పర్యటించిన మోడీ.. రాష్ట్రానికి పసుపు బోర్డు ప్రకటించిన నేపథ్యంలో రైతులు మోడీకి ఘన స్వాగతం పలకనున్నారు.

  • 03 Oct 2023 02:59 PM (IST)

    ప్రధాని మోదీ షెడ్యూల్‌

    • మంగళవారం మధ్యాహ్నం2.55 గంటలకు ఎంఐ–17 సైనిక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుంటారు.
    • 3 గంటలకు ఇక్కడి గిరిరాజ్‌ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.
    • 3.35 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహిస్తారు.
    • 3.45 గంటలకు పక్కనే ఏర్పాటు చేసిన బహిరంగ సభా వద్దకు చేరుకుంటారు.
    • 4.45 గంటల వరకు మోడీ ప్రసంగం ఉంటుంది.
    • సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్‌ నుంచి మోడీ హెలికాప్టర్‌లో తిరుగుప్రయాణం అవుతారు
  • 03 Oct 2023 02:52 PM (IST)

    అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం

    ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. ముందుగా ఆయన  పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

Published On - Oct 03,2023 2:49 PM

Follow us
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..