AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కాంగ్రెస్‌- ఎంఐఎం మధ్య పాత పొత్తు.. కొత్తగా పొడిచిందా.. అక్భరుద్దీన్, రేవంత్ మాటల్లో ఆంతర్యమేంటి..?

ఇన్నాళ్లూ కారులో తిరిగిన గాలిపటం.. ఇప్పుడు హస్తం పార్టీ చేతుల్లోకి వెళ్తోందా? ఎన్నికల ముందు వరకు ఒక లెక్క.. ఎన్నికల తర్వాత మరో లెక్క అన్నట్టుగా కాంగ్రెస్, ఎంఐఎం మధ్య కొత్త బంధం ఏర్పడబోతోందా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఫలితాలు వచ్చి రెండు వారాలు కూడా కాలేదు. ఇంతలోనే ఈ రాజకీయ మార్పులేంటి? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెబుతుంటారు.

Telangana: కాంగ్రెస్‌- ఎంఐఎం మధ్య పాత పొత్తు.. కొత్తగా పొడిచిందా.. అక్భరుద్దీన్, రేవంత్ మాటల్లో ఆంతర్యమేంటి..?
Revanth Reddy and Akbaruddin
Srikar T
|

Updated on: Dec 17, 2023 | 10:01 AM

Share

ఇన్నాళ్లూ కారులో తిరిగిన గాలిపటం.. ఇప్పుడు హస్తం పార్టీ చేతుల్లోకి వెళ్తోందా? ఎన్నికల ముందు వరకు ఒక లెక్క.. ఎన్నికల తర్వాత మరో లెక్క అన్నట్టుగా కాంగ్రెస్, ఎంఐఎం మధ్య కొత్త బంధం ఏర్పడబోతోందా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఫలితాలు వచ్చి రెండు వారాలు కూడా కాలేదు. ఇంతలోనే ఈ రాజకీయ మార్పులేంటి? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెబుతుంటారు. అలాంటి పరిస్థితులే తెలంగాణ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు సవాళ్లు- ప్రతి సవాళ్లతో హీట్‌ పుట్టించిన కాంగ్రెస్‌- ఎంఐఎం మధ్య పాత పొత్తు.. కొత్తగా పొడిచిందా అన్న చర్చ మొదలైంది. ఎన్నికల ప్రచారాల్లో ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తిట్టి పోసుకున్నాయి. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదనే రేంజ్‌లో ఎంఐఎం పనిచేసింది. కాంగ్రెస్ సైతం ఎంఐఎంపై అదేస్థాయిలో మండిపడింది. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు స్నేహహస్తం అందుకుంటున్నాయి ఈ రెండు పార్టీలు.

మొన్నటికి మొన్న ప్రొటెం స్పీకర్ ఎన్నిక అందరినీ ఆశ్చర్యపరిస్తే.. ఆ తర్వాత గ్రేటర్‌ హైదరాబాద్‌పై సమీక్ష చేస్తున్నప్పుడు అక్బరుద్దీన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పక్కనే కూర్చోబెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య మిత్రబంధం ఏర్పడిందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తాము గత ప్రభుత్వంతో ఎలా నడుచుకున్నామో.. ఇప్పుడూ అలాగే ఉంటామంటున్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ. అభివృద్ధికి సహకరిస్తామంటూ అసెంబ్లీ ముఖంగా ప్రకటించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ బంధాన్ని బలపడేలా వ్యాఖ్యలు చేశారు. మిత్రులు అంటూ ఎంఐఎం పార్టీని సంబోధించారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి నేరుగా మద్దతు ఇవ్వకపోయినా.. తాము ప్రభుత్వం పక్షానే ఉన్నామనే సంకేతాలు పంపేలా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
‘మార్పు’ ఒక్కటే శాశ్వతం! అన్నీ ఈ పాతికేళ్ల ప్రస్థానంలోనే..
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
అరుదైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌ నిర్మాణం
తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఈ ఆహారాలకు ఉందని తెలుసా?
తెల్ల జుట్టును నల్లగా మార్చే పవర్ ఈ ఆహారాలకు ఉందని తెలుసా?
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయ్.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్
దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయ్.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన కామెంట్
కొత్త ఏడాది మీ రాశికి ఉన్న గ్రహ దోషాలను ఇలా పోగొట్టుకోండి..!
కొత్త ఏడాది మీ రాశికి ఉన్న గ్రహ దోషాలను ఇలా పోగొట్టుకోండి..!
ఓపెన్‌ ఫోర్స్‌ ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్నారా..? ఇలా ట్రై చేయండి..
ఓపెన్‌ ఫోర్స్‌ ఇబ్బందిగా ఫీల్‌ అవుతున్నారా..? ఇలా ట్రై చేయండి..
జీమెయిల్ వాడుతున్నారా..? ఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్
జీమెయిల్ వాడుతున్నారా..? ఎగిరి గంతేసే వార్త చెప్పిన గూగుల్
బిగ్‌ షాక్‌.. ఇకపై వారికి నో గ్రాట్యుటీ!
బిగ్‌ షాక్‌.. ఇకపై వారికి నో గ్రాట్యుటీ!