AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. సభలో వాడీవేడిగా సాగిన..

ఇక ప్రతిపక్షాల దాడికి రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసం, రాచరిక పోకడలు అవలంభించారని మండిపడ్డారు. మొత్తం మీద ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడి వాదనలు సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అనంతరం..

Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. సభలో వాడీవేడిగా సాగిన..
Ts Assembly
Narender Vaitla
|

Updated on: Dec 16, 2023 | 6:37 PM

Share

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. శనివారం అసెంబ్లీలో వాడివేడీ చర్చల అనంతరం ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ ప్రకటన చేశారు. శనివారం అసెంబ్లీ మొదలైన వెంటనే కాంగ్రెస్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో విధ్వంసం తప్ప, చెప్పుకోవడానికి ఏముంది అంటూ ఫైర్‌ అయ్యారు కేటీఆర్‌.

ఇక ప్రతిపక్షాల దాడికి రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసం, రాచరిక పోకడలు అవలంభించారని మండిపడ్డారు. మొత్తం మీద ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడి వాదనలు సాగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన అనంతరం.. దీనిపై క్లారిఫికేషన్ అడిగేందుకు బీఆర్‌ఎస్‌ తరపున మాజీమంత్రి హరీశ్ రావు సిద్ధమయ్యారు. అయితే ఆయన క్లారిఫికేషన్‌కు పరిమితం కాకుండా చర్చ చేయడం సరికాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సూచించారు.

ఇదే విషయంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా హరీశ్ రావుకు సూచనలు చేశారు. కేవలం క్లారిఫికేషన్‌కు మాత్రమే పరిమితం కావాలని కోరారు. అయితే గతంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి ప్రసంగం తరువాత ఇద్దరు విపక్ష సభ్యులకు అవకాశం కల్పించారని.. తనకు కూడా అలాంటి ఇవ్వాలని హరీశ్ రావు కోరారు. లేకపోతే తాను నిరసన తెలియజేస్తానని అన్నారు. మరోవైపు సభలో ఈ అంశంపై గందరగోళం కొనసాగుతుండగానే.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను ఈ నెల 20కు వాయిదా వేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఛాంపియన్ సినిమాలో నటుడు.. విజయ్ బంధువా.. ?
ఛాంపియన్ సినిమాలో నటుడు.. విజయ్ బంధువా.. ?
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్