AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇక డ్రగ్‌ మాఫియాపై ఉక్కుపాదమే.. ఏకతాటిగా తెలంగాణ అసెంబ్లీ నిర్ణయం..

మనల్ని ఆపేదెవరు? మత్తు మాఫియా బెండు తీయాల్సిందే. డ్రగ్స్‌ దందాపై ఉక్కుపాదం మోపే విషయంలో అసెంబ్లీ ఏకతాటిపైకి వచ్చింది. చర్చలు గరంగరంగా సాగినా డ్రగ్స్‌ నిర్మూలనపై అందరూ ఏకతాటిపైకి వచ్చారు.. ఇది ఓకే.. కానీ డ్రగ్స్‌పై చర్చలో సభలో డైలాగ్‌ వార్‌ రభస మరో లెవల్‌.. అయితే, మహానగరంపై మత్తు మరక.. డ్రగ్స్‌ మాఫియాకు కళ్లెం ఎప్పుడు? ఎలా? ఎప్పటి నుంచో కొనసాగుతోన్న చర్చ.

Telangana: ఇక డ్రగ్‌ మాఫియాపై ఉక్కుపాదమే.. ఏకతాటిగా తెలంగాణ అసెంబ్లీ నిర్ణయం..
Telangana Assembly
Shaik Madar Saheb
|

Updated on: Dec 16, 2023 | 9:37 PM

Share

మనల్ని ఆపేదెవరు? మత్తు మాఫియా బెండు తీయాల్సిందే. డ్రగ్స్‌ దందాపై ఉక్కుపాదం మోపే విషయంలో అసెంబ్లీ ఏకతాటిపైకి వచ్చింది. చర్చలు గరంగరంగా సాగినా డ్రగ్స్‌ నిర్మూలనపై అందరూ ఏకతాటిపైకి వచ్చారు.. ఇది ఓకే.. కానీ డ్రగ్స్‌పై చర్చలో సభలో డైలాగ్‌ వార్‌ రభస మరో లెవల్‌.. అయితే, మహానగరంపై మత్తు మరక.. డ్రగ్స్‌ మాఫియాకు కళ్లెం ఎప్పుడు? ఎలా? ఎప్పటి నుంచో కొనసాగుతోన్న చర్చ. ఈ ముచ్చటే తెలంగాణ అసెంబ్లీలో చర్చగా.. వాడివేడి వాదనలో ఒకింత రచ్చగా మారింది. ఇది మచ్చుకు మాత్రమే. తెలంగాణ మూడో అసెంబ్లీలో చర్చ-రచ్చ మరో లెవల్‌. డ్రగ్స్‌పై ఉక్కుపాదం అనే సబ్జెక్ట్‌గా అంతకు మించి హీటెడ్‌ ఆర్గుమెంట్స్‌ జరుగుతుండగానే యాదృచ్చికంగా జీడిమెట్లలో గంజాయి ఘాటు గుప్పుమంది. తులసి వనంలో గంజాయి మొక్క అనే సామెతకు సరికొత్త టచ్‌ ఇచ్చారు కేటుగాళ్లు. నర్సరీ మొక్కల మాటున 400 కేజీల ఎండు గంజాయిని గుట్టుగా గట్టు దాటించే ప్రయత్నం బెడిసికొట్టింది. గంజాయి పట్టుబడింది. ఆ ఘాటు సంగతేమో కానీ డ్రగ్స్‌ సబ్జెక్ట్‌పై జరిగిన చర్చలో అధికార, విపక్షాల మధ్య డైలాగ్‌వార్‌తో సభ మస్తు హీటెక్కింది. డ్రగ్స్‌ నిర్మూలనకు అంతా సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. తప్పక సహకరిస్తామంది విపక్షం.

మొత్తానికి అలా డ్రగ్స్‌పై ఉక్కుపాదం విషయంలో ఏకత్వం వచ్చింది.కానీ టీఎస్‌ న్యాబ్‌ కేంద్రంగా చర్చ రసవత్తరంగా జరిగింది. పాత ముచ్చట్లతో పాటు డ్రగ్స్‌ పై డైలాగ్‌వార్‌లో భిన్నత్వం కొత్తగా రీసౌండ్‌ ఇచ్చింది. టీఎస్‌ న్యాబ్‌ ను కేవలం కాగితాలకు పరిమితం చేశారన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. డ్రగ్స్‌ నిర్మూలనకు 29 కోట్లు నిధులు మంజూరు చేయాలని కోరితే గత ప్రభుత్వం ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తాము 50కోట్లు కేటాయిస్తున్నామన్నారు సీఎం.. రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి విషయంలో రాజకీయాలు వద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరగా.. డ్రగ్స్ కట్టడి విషయంలో బీఆర్‌ఎస్ కూడా కలిసివస్తుందని కేటీఆర్ రిప్లే ఇచ్చారు.

ఇలా డ్రగ్స్‌ కట్టడిపై విమర్శించుకుంటూనే ఏకతాటిపైకి అధికార విపక్షాలు.. డ్రగ్స్‌ పే చర్చతో పాటు సభలో ఫ్లాష్‌బ్యాక్‌లు తళుక్కుమన్నాయి. డ్రగ్స్‌పై ఉక్కుపాదం సబ్జెక్ట్‌ అలా సభను హీటెక్కించింది. మాటలు మంటలు ఎలా వున్నా.. డ్రగ్స్‌ రహిత తెలంగాణ కోసం అధికార విపక్షాలు ఏకతాటికి పై రావడం మంచి శకునమేగా!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..