AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విద్యుత్ కనెక్షన్ కోసం లంచం..! రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికారుల లంచగొండులు పెరిగిపోతున్నాయి. ఏసీబీ తరచూ దాడులు చేస్తున్నప్పటికీ, అవినీతి తగ్గడం లేదు. వనపర్తిలో విద్యుత్ శాఖ అధికారి కొండన్న రూ.10,000 లంచంతో ఏసీబీకి చిక్కుకున్నాడు. గతంలో కూడా ఇదే విద్యుత్ కార్యాలయంలో అవినీతి కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటనలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి.

విద్యుత్ కనెక్షన్ కోసం లంచం..! రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Corruption In Mahabubnagar
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Apr 24, 2025 | 8:47 PM

Share

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికారుల లంచాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఏసీబీ అధికారులు తరచూ దాడులు చేసి లంచగొండులను పట్టుకుంటున్నా మిగిలిన అధికారుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వనపర్తి జిల్లాలో అయితే విద్యుత్ శాఖ అధికారుల లంచాలు మరింత ఆందోళన గురిచేస్తున్నాయి. ఏడాది గడవకముందే అదే విద్యుత్ ఆఫీస్ లో మరో అవినీతి అధికారి పట్టుబడటం కలకలం రేపుతోంది. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం ఎలక్ట్రికల్ ఏఈ కొండన్న రూ.10 వేలు లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుపడ్డాడు.

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వ్యాపారి వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతో రైస్ మిల్ నిర్మాణం చేపట్టారు. రైస్ మిల్‌కు విద్యుత్ సరఫరా కోసం TGSPDCLకు డీడీ చెల్లించారు. విద్యుత్ శాఖ అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను మహబూబ్ నగర్ కు చెందిన కాంట్రాక్టర్ సలీం అనే వ్యక్తికి అప్పగించారు. దీంతో సలీం 160 KV పనులను పూర్తి చేశాడు. విద్యుత్ కనెక్షన్ అప్రూవల్ ఇవ్వాల్సిందిగా ఏఈ కొండన్నను కోరగా.. ఇందుకోసం తనకు కొంత నగదును ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఐదు నెలల క్రితం రూ.30 వేల రూపాయలు కొండన్నకు ఇచ్చాడు సలీం. అయితే మరో రూ.20 వేలు కావాలని ఏఈ కొండన్న కాంట్రాక్టర్ సలీంను డిమాండ్ చేశాడు. దీంతో విసుగు చెందిన కాంట్రాక్టర్ మహబూబ్ నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఏఈ కొండన్నకు రూ.10 వేలు అందించే క్రమంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏఈ కొండన్న ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. గతేడాది మే 31వ తేదీన ఇదే జిల్లాలో ఏసీబీ అధికారులు ముగ్గురు విద్యుత్ శాఖ అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఘటన అనంతరం కార్యాలయంలో లంచాలకు వ్యతిరేకంగా వాల్ స్టిక్కర్స్ అంటించి వెళ్ళారు. ఏడాది తిరగకముందే మరో విద్యుత్ శాఖ అధికారి ఏసీబీకి చిక్కడం తీవ్ర కలకలం రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..
సర్పంచ్ అయిన డాక్టరమ్మ.. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన..