AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎక్సైజ్ శాఖకే కిక్ ఇచ్చేలా లిక్కర్ అప్లికేషన్స్‌.. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా..

తెలంగాణ ఎక్సైజ్ శాఖకు కాసుల పంట పండింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా లక్షకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. సరూర్‌నగర్, శంషాబాద్‌లో మద్యం షాపులు దక్కించుకునేందుకు.. అత్యధికంగా పోటీపడ్డారు. ఇక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న షాపులకి భారీగా ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో అప్లికేషన్లు పెట్టుకున్నారు. టెండర్ ప్రక్రియలో 2 వేల కోట్ల ఆదాయం వస్తుందనేది అబ్కారీ శాఖ అంచనా. కానీ అంతకుమించి అనేలా కనకవర్షం కురిసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

Telangana: ఎక్సైజ్ శాఖకే కిక్ ఇచ్చేలా లిక్కర్ అప్లికేషన్స్‌.. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా..
Liquor Shop
Ram Naramaneni
|

Updated on: Aug 18, 2023 | 9:06 PM

Share

రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాల కోసం.. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అయితే అధిక శ్రావణం కావడంతో.. తొలి పది రోజులు మందకొడిగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే చివరి రెండు రోజులు మాత్రం అప్లికేషన్లు పోటెత్తాయి. ఇది ముందే ఊహించిన ఎక్సైజ్ శాఖ.. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ దరఖాస్తులు స్వీకరించింది. ఎన్నడూ లేనంతగా రికార్డ్ స్థాయిలో లక్షకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అత్యధికంగా శంషాబాద్‌లో ఒక్కో షాపుకు 300కి పైగా దరఖాస్తులు వచ్చాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్ర సరిహద్దుల్లో వైన్ షాపులకి భారీగా అప్లికేషన్లు పెట్టుకున్నారు. అత్యథికంగా హైదరాబాద్‌లో 25వేలు, రంగారెడ్డిలో 20 వేల 200 మంది అప్లై చేసుకున్నారు.

ఇక జిల్లాల వారీగా చూస్తే.. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నది 240 మద్యం షాప్‌లు అయితే 7,871 మంది అప్లై చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 193 షాపులకు టెండర్లు ఆహ్వానించింది ప్రభుత్వం. దాదాపు 4వేలకు పైగానే టెండర్లు వేశారు. నిజామాబాద్‌లో 151కి గానూ 5వేల మంది టెండర్లు వేశారు. వరంగల్‌లో 12వేల దరఖాస్తుల వరకూ వచ్చాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా 290 వైన్ షాపులు ఉంటే.. 8300కి పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటి ద్వారా 160 కోట్ల ఆదాయం వచ్చింది. ఖమ్మం జిల్లాలో 7వేలు.. కొత్తగూడెం జిల్లాలో 3 వేల వరకూ దరఖాస్తులు వచ్చాయి. ఇక నల్గొండలో 336 షాపుల కోసం 11 వేల మందికి పైగా పోటీ పడ్డారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న 90 షాపులకు.. 2708కి పైగా అప్లికేషన్ పెట్టుకున్నారు.

వనపర్తి జిల్లా విషయానికి వస్తే.. ఇక్కడ 37 వైన్ షాపులకు వెయ్యి వరకూ దరఖాస్తులు రావడం జరిగింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలోనూ 36 షాపులకు వచ్చిన అప్లికేషన్లు వెయ్యి. 2021లో మద్యం టెండర్ల ద్వారా ఎక్సైజ్ శాఖకు 1,357 కోట్ల రూపాయల ఆదాయం రాగా.. ఈ సారి 2 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఒక్కసారి టెండర్ దక్కితే రెండేళ్లు కిక్కే కిక్కు.. ఎందుకంటే వరుస ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో భారీగా లిక్కర్ సేల్స్ ఉంటాయన్న అంచనాలతో.. విపరీతంగా టెండర్లు వేశారు. చివరి రెండు రోజులు వెల్లువలా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. దీంతో ఈనెల 21న షాపులు కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది అబ్కారీ శాఖ.  తెలంగాణలో 2,620 మద్యం షాపుల ఏర్పాటుకు ఆగస్టు 4 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తు రుసుము కింద అభ్యర్థుల నుంచి రూ.2 లక్షలు వసూలు చేస్తున్నారు. అది తిరిగి చెల్లించబడదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్