Money Mule: ఇక్కడ బాధితులే నిందితులు అవుతారు.. ‘మనీ మ్యూల్‌’ స్కామ్ గురించి తెలుసా..?

Money Mule Scma: ఇలాంటి స్కామ్‌లలో అసలు నిందితులను పట్టుకోవడం పోలీసులు, దర్యాప్తు అధికారులకు కష్టతరంగా మారుతోంది. ఈ స్కామ్‌ కేసుల్లో బాధితులు తమకు తెలియకుండానే నిందితులు అవుతున్నారు. నేరపూరిత చర్యల్లో భాగస్వామ్యం కావడం ద్వారా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వీరు జరిమానాలు చెల్లించడంతో పాటు జైలు శిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధికారులు సదరు వ్యక్తుల బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేస్తే.. ఆ రకంగానూ వారు ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.

Money Mule: ఇక్కడ బాధితులే నిందితులు అవుతారు.. ‘మనీ మ్యూల్‌’ స్కామ్ గురించి తెలుసా..?
Money Mule Scam
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 18, 2024 | 2:55 PM

మనీ మ్యూల్ స్కామ్.. ప్రస్తుతం ఎక్కువగా చోటుచేసుకుంటున్న ఓ మోసపూరిత విధానం ఇది. ఇక్కడ నేరస్థులు తాము అక్రమంగా సంపాదించిన డబ్బును దారిమళ్లించేందుకు మరో వ్యక్తికి తెలియకుండానే ఆ వ్యక్తిని వాడుకుంటారు. ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే.. ఆన్‌లైన్ జాబ్ పోస్టింగ్‌లు, సోషల్ మీడియా పోస్టింగ్స్  ద్వారా సైబర్ నేరగాళ్లు అమాయక వ్యక్తులను టార్గెట్ చేస్తారు. సులభంగా డబ్బు సంపాదించొచ్చు లేదా ఇంట్లో నుంచే పనిచేసి చేతినిండా డబ్బు సంపాదించే సదావకాశం అంటూ గాలం వేస్తారు. వారు చెప్పిన పనిచేసేందుకు మీరు సుముఖత వ్యక్తం చేస్తే ఇక వారు తమ పని మొదలుపెట్టేస్తారు.

రిక్రూట్ అయిన తర్వాత ఏవో కారణాలతో మీ బ్యాంక్ ఖాతాలో డబ్బును స్వీకరించాలని సూచిస్తారు. మా ఖాతా ఎందుకని మీరు అభ్యంతరం చెబితే.. చాలా అర్జెంట్ అంటూ సహేతుక కారణాలు చెప్పకుండానే మిమ్మిల్ని కన్విన్స్ చేసేస్తారు.  సాధారణంగా దొంగిలించబడిన సొమ్ము, ఆన్‌లైన్ స్కామ్‌లు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాల ద్వారా సంపాదించిన సొమ్మును వారి ఖాతాలకు పంపుతారు. ఈ సొమ్మును మరో బ్యాంకు ఖాతాకు ఫార్వర్డ్ చేయాలని సూచిస్తారు. ఇందు కోసం బ్యాంకింగ్ సేవల నిమిత్తం కొంత మొత్తాన్ని ఉంచుకోవాలంటూ కాస్త ‘ఉదారత’ను కూడా ప్రదర్శిస్తారు.  ఇలా తమ అక్రమ బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఇతరులకు తెలీకుండానే వారిని వాడేసుకుంటారు. అలా చట్టవిరుద్ధంగా సంపాదించిన డబ్బును పొందేందుకు లేదా ట్రాన్సఫర్ అయ్యేందుకు నేరగాళ్లు పావుగా వాడుకున్న వ్యక్తినే మనీ మ్యూల్ అంటారు.

అయితే ఇలాంటి స్కామ్‌లలో అసలు నిందితులను పట్టుకోవడం పోలీసులు, దర్యాప్తు అధికారులకు కష్టతరంగా మారుతోంది. ఈ స్కామ్‌ కేసుల్లో బాధితులు తమకు తెలియకుండానే నిందితులు అవుతున్నారు. నేరపూరిత చర్యల్లో భాగస్వామ్యం కావడం ద్వారా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వీరు జరిమానాలు చెల్లించడంతో పాటు జైలు శిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధికారులు సదరు వ్యక్తుల బ్యాంకు అకౌంట్లను స్తంభింపజేస్తే.. ఆ రకంగానూ వారు ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.

మనీ మ్యూల్ స్కామ్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు ఇస్తామని జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. వ్యక్తిగతంగా మీకు తెలియని వారి తరపున డబ్బు స్వీకరించడం లేదా ఫార్వార్డ్ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరిస్తున్నారు. మీకు వ్యక్తిగతంగా తెలియని వారికి ఎట్టి పరిస్థితిలోనూ మీ బ్యాంకు ఖాతాల వివరాలను పంచుకోవద్దని సూచించారు. మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు భావిస్తే వెంటనే పోలీసు అధికారులకు, మీ బ్యాంకుకు తెలియజేయాలని సూచిస్తున్నారు.

మనీ మ్యూల్‌పై రియాక్ట్ అయిన సజ్జనార్ 

తాజాగా ఈ మనీ మ్యూల్ స్కామ్‌పై సీనియర్ ఐపీఎస్ అధికారి, టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మనీ మ్యూల్‌గా పనిచేయడం నేరమన్నారు. ఇతరులు తమ ధనాన్ని తరలించేందుకు మీ బ్యాంకు ఖాతాను ఉపయోగించనివ్వకూడదన్నారు. ఇతరులు డబ్బులు స్వీకరించేందుకు లేదా ట్రాన్స్‌ఫర్ చేసేందుకు మీ ఖాతాను వాడుకునేందుకు అనుమతిస్తే.. అది మిమ్మల్ని జైలుపాలు చేసే అవకాశముందన్నారు.

సజ్జనార్ పోస్ట్..

ఇలా ఫిర్యాదు చేయండి..

ఇటువంటి విషయాలను మీ బ్యాంకు, రాష్ట్రాయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కి లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ (1930) ద్వారా తెలియజేయాలని సజ్జనార్ సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి.

హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
హిజాబ్‌లో దర్శనమిచ్చిన ప్రముఖ హీరోయిన్.. షాక్‌లో ఫ్యాన్స్..వీడియో
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
అత్యవసర పరిస్థితి విధించినందుకు అరెస్ట్..!
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.?
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
ఎండుద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే
"సచిన్ కో బోలో": యోగరాజ్ వ్యాఖ్యలతో క్రికెట్ లో కొత్త చర్చలు
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
అబార్షన్‌తో కన్నీరు మున్నీరైన టాలీవుడ్ యాంకర్.. వీడియో
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
భారత క్రికెట్ జట్టులో మంటలు: గంభీర్ ధోరణి పై చర్చలు
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
ముఖానికి అలోవెరా జెల్ రాసుకుని నిద్రపోతున్నారా..?ఏమవుతుందో తెలుసా
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
రికార్డ్ స్థాయిలో అమృత స్నానం ఆచరించిన భక్తులు
"కౌన్ హైన్?".. కపిల్ అంత మాట అంటాడని ఎవరు ఊహించలేదు..!