Telangana Congress: కోమటిరెడ్డి బీసీ నినాదం వెనుక కథేంటి? జానా, ఉత్తమ్‌లకు చెక్ పెట్టేందుకేనా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం బీసి నినాదం హాట్ టాపిక్ గా మారింది.. జనాభాలో అత్యధిక సామాజిక వర్గం ఉన్న బీసీలకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసే కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తాజాగా మరోసారి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి ఈ కామెంట్స్ వెనుక ఉన్న కథేంటి? అనేదే ఇప్పుడు పొలిటికల్‌గా ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ వ్యవహారంపై ఓ లుక్కేసుకుందాం..

Telangana Congress: కోమటిరెడ్డి బీసీ నినాదం వెనుక కథేంటి? జానా, ఉత్తమ్‌లకు చెక్ పెట్టేందుకేనా..?
Mp Komatireddy Venkat Reddy
Follow us
M Revan Reddy

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 30, 2023 | 2:02 PM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం బీసి నినాదం హాట్ టాపిక్ గా మారింది.. జనాభాలో అత్యధిక సామాజిక వర్గం ఉన్న బీసీలకు ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసే కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. తాజాగా మరోసారి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. మరి ఈ కామెంట్స్ వెనుక ఉన్న కథేంటి? అనేదే ఇప్పుడు పొలిటికల్‌గా ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది. మరి ఈ వ్యవహారంపై ఓ లుక్కేసుకుందాం..

రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేస్తూ కీ రోల్ పోషించే నేతలంతా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే. సీనియర్ కాంగ్రెస్ నేతలు కుందూరు జానా రెడ్డి, నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు మూడు నియోజకవర్గాలు ప్రభావితం చేస్తారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఇప్పటికే పలువురు ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీసీల కోసం తాను పోటీ చేయబోయే నల్గొండ సీటును త్యాగం చేస్తానని హాట్ కామెంట్స్ చేశారు. అయితే కోమటి రెడ్డి వ్యాఖ్యల వెనుక పెద్ద ట్విస్ట్ ఉందట.. తాను అలా మాట్లాడటం వెనుక మిగిలిన నాయకులకు చెక్ పెట్టేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఈసారి జానా రెడ్డి ఎన్నికలకు దూరంగా ఉండి తన ఇద్దరు కొడుకులను మిర్యాలగూడ, నాగార్జున సాగర్ నుండి బరిలోకి దింపాలని వ్యూహంతో ఉన్నారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి కోదాడ, హుజూర్ నగర్ ల నుండి పోటీ చేస్తామని ఉత్తమ్ పలు సార్లు ప్రకటించారు. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డికి గతంలో కాంగ్రెస్ లో ఉన్నపుడు ఇద్దరికి ఎమ్మెల్యే, ఎంపీలుగా అవకాశం వచ్చింది. రాజ్ గోపాల్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. అయితే నల్గొండ, నకిరేకల్, ఆలేరు, భువనగిరిలలో తాను సూచించిన వారికే అవకాశం దక్కనుంది.

ఇటీవల భువనగిరిలో బీసీ నాయకులను ప్రోత్సహించడంతో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పటికే కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇద్దరూ ఎంపీలుగా ఉన్నారు. వారి పదవులకు రాజీనామా చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. అయితే కోమటిరెడ్డి బీసీలకు టికెట్ త్యాగం చేస్తానని చెప్పడం వెనుక అటు జానా రెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు చెక్ పడనుందట. వారిద్దరిలో ఒకరికే టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉంటున్న కోమటిరెడ్డి.. బీసీ నినాదం వ్యూహాత్మంగానే ఎత్తుకున్నారని పార్టీలో టాక్.

ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక కుటుంబంలో ఒక్కరికే తప్ప ఇద్దరికి అవకాశం ఉండదనే నిబంధన ఉంది. అయితే ఎప్పటి నుండో పార్టీలో ఉన్న వారికి అది వర్తించదని ఉత్తమ్ చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే ఉత్తమ్, రేవంత్ ల మధ్య రగడ జరుగుతోంది. నల్లగొండ అసెంబ్లీ స్థానానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మరో ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మాజీ జెడ్పిటిసి తండు సైదులు, నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ లక్ష్మీ దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిసి నినాదం నల్లగొండ కాంగ్రెస్ లో హాట్ హాట్ గా మారింది. కానీ కోమటిరెడ్డి తన సీటును వదులుకుంటే మిగిలిన వారు కూడా వదులు కోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

మొత్తానికి కోమటిరెడ్డి బీసీలకి టికెట్ త్యాగం చేస్తానని చెప్పడంతో బీసీ నేతలంతా కోమటిరెడ్డిపై అభిమానం చూపిస్తున్నారు. అయితే సొంత పార్టీ నేతలు మాత్రం ఆయన పై గుర్రుగా ఉన్నారట. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..