Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అన్నకు రాఖీ కట్టాలని ఆనందంగా వచ్చిన చెల్లి.. అంతలోనే పెను విషాదం.. చివరకు మృతదేహానికి..

రాఖీ.. అన్నా చెల్లెల్లు.. అక్కా తమ్ముడి బంధానికి ప్రతీక. హిందూ సంప్రదాయంలో ఈ పండుగకు ప్రత్యేక స్థానముంది. తమ అక్కాచెల్లెళ్లకు భరోసాగా ఉండాలని ప్రతి సోదరుడు ఆరాటం పడుతుటారు. అలాగే తమ సోదరులు ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ తనకెప్పుడు రక్షణగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. రాఖీ పండగ కోసం మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఎప్పుడెప్పుడు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టాలా అని చూస్తుంటారు. ఎన్నో ఆశలతో.. గుండె నిండా సంతోషంతో తమ సోదరుడికి రాఖీ కట్టాలని పుట్టింటికి వెళ్తుంటారు. అలాగే ఓ చెల్లి కూడా...

Telangana: అన్నకు రాఖీ కట్టాలని ఆనందంగా వచ్చిన చెల్లి.. అంతలోనే పెను విషాదం.. చివరకు మృతదేహానికి..
Man Dies With Heart Stroke
Follow us
G Sampath Kumar

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 30, 2023 | 1:44 PM

రాఖీ.. అన్నా చెల్లెల్లు.. అక్కా తమ్ముడి బంధానికి ప్రతీక. హిందూ సంప్రదాయంలో ఈ పండుగకు ప్రత్యేక స్థానముంది. తమ అక్కాచెల్లెళ్లకు భరోసాగా ఉండాలని ప్రతి సోదరుడు ఆరాటం పడుతుటారు. అలాగే తమ సోదరులు ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటూ తనకెప్పుడు రక్షణగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. రాఖీ పండగ కోసం మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. ఎప్పుడెప్పుడు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టాలా అని చూస్తుంటారు. ఎన్నో ఆశలతో.. గుండె నిండా సంతోషంతో తమ సోదరుడికి రాఖీ కట్టాలని పుట్టింటికి వెళ్తుంటారు. అలాగే ఓ చెల్లి కూడా తన అన్నకు రాఖీ కట్టాలని ఎంతో ఆరాటంతో, ఆనందంతో పుట్టింటికి వచ్చింది. చెల్లి రాక కోసం ఎదురుచూసిన అన్న సంతోషంగా ఆమెతో గడిపాడు. అంతలోనే తిరిగిరాని లోకాలను వెళ్లిపోయాడు. అప్పటివరకు తనతో మాట్లాడిన తన అన్న ఇక లేడని తెలిసి ఆ చెల్లి గుండె బరువెక్కింది. తెచ్చిన రాఖీ కట్టకుండానే అనంత లోకాలకు వెళ్లడంతో దిక్కులు పెక్కటిల్లేలా విలపించింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుండెపోటుతో మృతి చెందిన అన్నకు రాఖీ కట్టి తన అనుబంధాన్ని తెలిపింది ఓ చెల్లెలు. ప్రతి యేటా అన్నకు రాఖి కట్టెందుకు చెల్లి వస్తున్నారు. రెండు రోజుల పాటు అన్నతో సంతోషంగా గడిపేవారు. ఎప్పటి లాగే రాఖి కట్టెందుకు చెల్లి వచ్చారు. అయితే.. విగత జీవిగా ఉన్న అన్నకు రాఖి కడుతానని అమె అస్సలు ఉహించ లేదు. పండుగ పూట ఈ ఇంట్లో విషాదం నెలకొంది. అన్న ను పట్టుకొని ఆ చెల్లె కన్నీరు.. మున్నీరుగా విలపించారు.

పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య ఎప్పటిలాగే పొలానికి వెళ్లి పొలం పనులు చేస్తుండగా ఒకసారిగా గుండెపోటు రావడంతో పొలం వద్దనే మృతి చెందారు. అయితే ఆయన చెల్లెలు రాఖీ కట్టేందుకు అన్న ఇంటికి వచ్చారు. రాఖీ పండుగకు ఒకరోజు ముందే అన్న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలియగానే చెల్లెలు గౌరమ్మ షాక్‌కు గురైంది. గుండెపోటుతో మృతి చెందిన అన్న కనకయ్యకు రాఖీ కట్టి బోరున విలపించారు గౌరమ్మ. చనిపోయిన అన్నకు రాఖీ కట్టడం పలువురిని కంటతడి పెట్టించింది. గౌరమ్మ.. ప్రతి ఏటా రాఖి పండుగ రోజు వచ్చి.. రాఖి కట్టి వెళ్ళేది. ఈ సారి ముందుగా వచ్చారు. అన్నకు ఫోన్ చేసి వచ్చారు. ఎటూ వెళ్లకుండా.. ఇంట్లో ఉండాలని కోరారు. పండుగను ఆనందంగా జరుపుకుందామని.. అనుకున్నారు. కానీ.. అన్న మరణంతో చెల్లెకి కన్నీళ్లు మిగిలాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!