Telangana: హమ్మయ్యా.. ఇక నిమ్స్‎లో ఓపి సేవల కోసం గంటలకొద్దీ లైన్లలో నిలబడే అవసరం లేదు

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందింది. నిమ్స్‎లో 20 కంటే ఎక్కువ విభాగాలు ఉన్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్, డర్మటాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ మొదలైన విభాగాలు ఉన్నాయి. అయితే ఇన్ని సేవలు అందించే ఈ హాస్పిటల్‎లో నిత్యం రోగులతో రద్దీగా కనిపిస్తుంది. ఓపీ టోకెన్ దొరకాలంటే గంటల తరబడి లైన్లల్లో వేచి ఉండాలి. రోగుల రద్దీ దృష్టిలో పెట్టుకొని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి ఎటూ సరిపోక నిరీక్షణ తప్పట్లేదు.

Telangana: హమ్మయ్యా.. ఇక నిమ్స్‎లో ఓపి సేవల కోసం గంటలకొద్దీ లైన్లలో నిలబడే అవసరం లేదు
Nims Hospital
Follow us
S Navya Chaitanya

| Edited By: Aravind B

Updated on: Aug 30, 2023 | 2:31 PM

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందింది. నిమ్స్‎లో 20 కంటే ఎక్కువ విభాగాలు ఉన్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్, డర్మటాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ మొదలైన విభాగాలు ఉన్నాయి. అయితే ఇన్ని సేవలు అందించే ఈ హాస్పిటల్‎లో నిత్యం రోగులతో రద్దీగా కనిపిస్తుంది. ఓపీ టోకెన్ దొరకాలంటే గంటల తరబడి లైన్లల్లో వేచి ఉండాలి. రోగుల రద్దీ దృష్టిలో పెట్టుకొని అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అవి ఎటూ సరిపోక నిరీక్షణ తప్పట్లేదు. ఇక వేరువేరు ఉపాయాలు ఆలోచిస్తూ కియోస్క్ లు ప్రవేశపెట్టే యోచనలో ఉంది అధికార యంత్రాంగం. దీంతో కియోస్క్‎ల ద్వారా నేరుగా టోకెన్ చీటీనీ తీసుకునే అవకాశం కలుగుతుంది.

ముందుగా రెండు, మూడు భాగాల వద్ద ప్రయోజాత్మకంగా ఏర్పాటు చేసి అవి ప్రజలు సక్రమంగా ఉపయోగించుకుంటూ విజయవంతమైతే మరెన్నో ఏర్పాటు చేయాలని నిమ్స్ అధికారులు భావిస్తున్నారు. ప్రతిరోజు నిమ్స్ హాస్పిటల్ దాదాపు 3500 మంది ఓపి సేవలకు వస్తుంటారు. మరీ ముఖ్యంగా మిలీనియం, ఆర్థోపెడిక్, స్పెషాలిటీ బ్లాక్ ల వద్ద ప్రతి ఒక్క ఓపి కేంద్రం రద్దీగా ఉంటుంది. ముఖ్యందా సోమవారం, మంగళవారం, బుధవారాల్లో అయితే రోగులు తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికోసం ఏర్పాటు చేసిన కియోస్క్‎లో అన్ని వివరాలు ఉంటాయి. అన్ని విభాగాలు, వైద్యుల పేర్లు అన్ని అందులో ఫీడ్ చేసి ఉంటాయి. అందులోకి వెళ్లి ఈ వివరాలు అన్ని నింపితే టోకెన్ పొందవచ్చు. ఓపికి చెల్లించాల్సిన డబ్బులు కౌంటర్ వద్ద లేదా ఆన్‌లై‎న్లోనే చెల్లించవచ్చు. దానితో పాటు ఇప్పటికే ఆన్లైన్లో కూడా ఓపి స్లాట్లు పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలంటే రోజు, సమయం, విభాగం, డాక్టర్లు ఎంపిక చేసుకొని ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే నేరుగా సెల్‎ఫోన్ కే సమాచారం వస్తుంది. ఆ సమాచారాన్ని కౌంటర్లో చూపిస్తే వెంటనే టోకెన్ ఇస్తారు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిందేంటంటే స్లాట్‎లో చూపించిన సమయం కంటే 15 నిమిషాలు ముందుగా వస్తే సరిపోతుంది. అంతేకాకుండా పరీక్షలు చేయుంచుకున్న తర్వాత మూడు గంటల్లోపే పరీక్షలు, నివేదికలు రోగుల సెల్‌ఫోన్లకే అందిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు రివ్యూ ఓపీ ఏర్పాటు చేసి, ఆ రిపోర్టులను అక్కడి వైద్యులకు చూపించి, సూచనలు తీసుకొని వెంటనే ఆరోజు ఇంటికి తిరిగి వెళ్లొచ్చు. అయితే ఇక వారం పది రోజుల్లో ప్రయోగాత్మక పరిశీలన కింద వీటిని అందుబాటులోకి తేనన్నారు. ఇక నిమ్స్‎లో ఓపి సేవల కోసం గంటల కొద్ది నిరీక్షించాల్సిన పనిలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ
వదలకండి.. స్వీట్‌కార్న్‌ తింటే బోలెడు లాభాలు.. ఇలాంటి సమస్యలన్నీ
అక్కడ తన పేరును చూసుకొని మురిసిపోయిన డీజీపీ
అక్కడ తన పేరును చూసుకొని మురిసిపోయిన డీజీపీ
హైడ్రా బుల్డోజర్లు.. మళ్లీ గర్జించాయి
హైడ్రా బుల్డోజర్లు.. మళ్లీ గర్జించాయి
మకర సంక్రాంతి రోజున ఇలాంటివిదానంచేయండి..మీ అదృష్టం ప్రకాశిస్తుంది
మకర సంక్రాంతి రోజున ఇలాంటివిదానంచేయండి..మీ అదృష్టం ప్రకాశిస్తుంది