Rains Alert: కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం..
మారిన వాతావరణం కారణంగా. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురుస్తోంది. ఏపీలోను కూల్ క్లైమాట్ ఏర్పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాయలసీమతో పాటు, తమిళనాడును వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. దక్షిణ తమిళనాడులోని 5 జిల్లాలతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. శని, ఆదివారాలు కూడా వరుణుడు విజృంభించనున్నాడు.
మారిన వాతావరణం కారణంగా. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీవర్షం కురుస్తోంది. ఏపీలోను కూల్ క్లైమాట్ ఏర్పడింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
మరోవైపు హైదరాబాద్‌లో అయితే.. లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునగడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే షేక్ పేటలో 9 సె.మీ వర్షం నమోదైంది. పాతబస్తీ, రాజేంద్రనగర్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, కూకట్ పల్లి, జీడిమెట్ల, గచ్చిబౌలితో పాటు పలు చోట్ల వర్షాలు కురిశాయి..సిటీ క్లైమాట్ అయితే ఊటీని తలపిస్తోంది.
సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో కురిసిన భారీ వడగళ్ల వాన కాశ్మీర్ ను తలపించింది. వడగండ్ల వానతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, వికారాబాద్ జిల్లాలో కశ్మీర్ అందాలు కనిపించాయి. ఇంకా రెండ్రోజుల పాటు ఈ వానలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..