AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Weather: రానున్న 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం.. వాతావరణశాఖ అలెర్ట్

రాగల 3 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Telangana Weather: రానున్న 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం.. వాతావరణశాఖ అలెర్ట్
Telangana Rains
Ram Naramaneni
|

Updated on: Oct 14, 2022 | 1:03 PM

Share

తెలంగాణ ప్రజలకు అలెర్ట్. రాగల 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టే అవకాశం ఉందని తెలిపింది వెదర్ డిపార్ట్‌మెంట్. హైదరాబాద్ నగరానికి కూడా వర్ష సూచన చేసింది. నల్గొండ, నాగర్‌ కర్నూల్‌, సంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌, సంగారెడ్డి,  మెదక్‌, వరంగల్‌, జగిత్యాల, జనగామ, మహబూబ్‌నగర్‌, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, కొమురంభీమ్‌ ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పొలాలకు వెళ్లిన రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం కురిసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. గొర్రెలు, మేకలు ఇతర జీవాలను మేపేందుకు వెళ్లినవారు సైతం అప్రమత్తంగా ఉండాలని కోరింది.

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. దీంతో అయిజ శివారులోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మేడికొండ, పులికల్, చిన్న తాండ్రపాడు, వేణిసోంపురం, కేశవరం గ్రామాలకు రాకపోకలకు పూర్తిగా అంతరాయం కల్గింది. ఇద్దరు యువకులు బైక్‌పై వాగు దాటేందుకు ప్రయత్నించగా.. అదుపుతప్పింది. వెంటనే అక్కడున్న వాళ్లు వెళ్లి.. బైక్‌తో పాటు యువకులను సేఫ్‌గా ఒడ్డుకు తీసుకొచ్చారు. వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

సీమలో జలవిలయం

రాయలసీమలో జలవిలయం కంటిన్యూ అవుతోంది. హిందూపూర్‌లో వరద బీభత్సం సృష్టిస్తోంది. పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో సమీప ప్రాంతాల వాసులు వణికిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ నుంచి వరద వస్తుండడంతో ఉధృతి పెరుగుతూనే ఉంది. కుట్టమూరు మరువలో ఓ లారీ చిక్కుకుంది. లారీని జెసిబి లతో ఒడ్డున చేర్చేందుకు స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు. కొత్తపల్లి మరవ వాగు రోడ్డుకు అడ్డంగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. హిందూపురం – చిలమత్తూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

వాగులు, వంతెనలు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. లేదంటే.. ప్రమాదం బారిన పడక తప్పదు. రోజు వెళ్లే దారే కదా.. ఎప్పుడూ దాటే వాగే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!