AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ మంత్రి భీషణ ప్రతిజ్ఞ.. మూడోసారి TRS అధికారంలోకి వచ్చే వరకూ చెప్పులు ధరించనంటూ..

రాష్ట్రంలో మళ్ళీ టీఆరెఎస్ అధికారంలోకి రావాలని కోరుతూ.. మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను టీఆరెఎస్ అధికారంలోకి వచ్చి.. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే వరకు..

Telangana: తెలంగాణ మంత్రి భీషణ ప్రతిజ్ఞ.. మూడోసారి TRS అధికారంలోకి వచ్చే వరకూ చెప్పులు ధరించనంటూ..
Minister Satyavathi Rathod
Surya Kala
|

Updated on: Oct 14, 2022 | 1:16 PM

Share

ఉమ్మడి ఆంధ్రపదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది మొదలు.. టీఆరెఎస్ పార్టీనే అధికారం చేపట్టింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన టీఆరెఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో వరసగా రెండో సారి అధికారం చేపట్టింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడో అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ రాష్ట్రంలో వరసగా మూడోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి భీషణ ప్రతిజ్ఞ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

రాష్ట్రంలో మళ్ళీ టీఆరెఎస్ అధికారంలోకి రావాలని కోరుతూ.. మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను టీఆరెఎస్ అధికారంలోకి వచ్చి.. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే వరకు చెప్పులు లేకుండానే తిరుగుతానని భీషణ ప్రతిజ్ఞ చేశారు. గిరిజనులకు 10% రిజర్వేషన్లు ప్రకటించిన స్టేజి మీదనే తాను చెప్పులు ధరించడం వదిలేసినట్లు పేర్కొన్నారు. గిరిజనులందరి పక్షాన గిరిజన బిడ్డగా మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు మంత్రి సత్యవతి రాథోడ్.

తాను ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎవరిని సంప్రదించలేదని..  ఇప్పుడు ఎవరు వద్దన్నా వెనక్కి చూడనని చెప్పారు. రానున్నది  ఎండాకాలమైనా సరే తాను చెప్పులు లేకుండానే తిరుగుతానని స్పష్టం చేశారు. మళ్ళీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతనే తిరిగి కాళ్లకు చెప్పులు ధరిస్తానని పేర్కొన్నారు సత్యవతి రాథోడ్. ఇది తాను కెసీఆర్ పై ఉన్న అభిమానంతో తీసుకున్న నిర్ణయమని.. పూర్తిగా తన వ్యక్తిగతమని వెల్లడించారు మంత్రి సత్యవతి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..