Hyderabad: న్యూబోయిన్‌పల్లిలో షాకింగ్ ఘటన.. ఎలక్ట్రిక్ బైక్‌లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
మరో ఎలక్ట్రిక్ బైక్ లో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులంతా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సేమ్ సీన్ రిపీట్. ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు చెలరేగాయి. హైదరాబాద్‌లోని న్యూబోయిన్‌పల్లిలో జరిగిందీ ఘటన. ఓం రెసిడెన్సీలో పార్కింగ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్‌లోంచి పొగలు వచ్చాయి. మంట రాజుకుంది. దీన్ని గమనించి అపార్ట్‌మెంట్ వాసులు వాటిని ఆర్పేశారు. ఎలక్ట్రిక్ బైక్‌లో మంటలు రావడం తరచూ జనాలను భయపెడుతున్నాయి. చాలాచోట్ల రన్నింగ్‌లో ఉండగా మంటలు అంటుకోగా… బ్యాటరీ చార్జింగ్ పెట్టినప్పుడు ఏకంగా పేలిపోయిన ఘటనలూ జరిగాయి. అయితే.. ఎలక్ట్రిక్ బైక్‌ను పార్క్ చేసి ఉన్నప్పుడు పొగ, మంటలు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.
Published on: Oct 14, 2022 02:03 PM
వైరల్ వీడియోలు
Latest Videos